Rajinikanth Political Entry: సూపర్‌స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ మధ్యన పొలిటికల్ ఎంట్రీని కన్ఫర్మ్ చేసిన రజనీ.. జనవరిలో పొలిటికల్ పార్టీని ప్రకటిస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన వివరాలను 31వ తేది ప్రకటిస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలో అందుకోసం పక్కాగా ఏర్పాట్లు చేసుకున్న సూపర్‌స్టార్.. ఆ లోపు తాను ఒప్పుకున్న అణ్ణాత్తే సినిమాను పూర్తి చేయాలని అనుకున్నారు. అంతేకాదు రోజుకు 14 గంటల పాటు షూటింగ్లో కూడా పాల్గొన్నారు. అయితే ఈ లోపే ఊహించని షాక్ తగిలింది. అణ్ణాత్తే యూనిట్లో పలువురికి కరోనా సోకింది. రెండు రోజుల తరువాత రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న రజనీకాంత్.. ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. కాగా ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఆలోచించుకోవాలని ఇంట్లో వాళ్లు సూచించినట్లు తెలుస్తోంది.
రాజకీయాలు మనకు వద్దు నాన్న. ఇక ఆ పనులను వదులుకోండి అని రజనీ కుమార్తెలు ఆయనను కోరినట్లు సమాచారం. రాజకీయాలు, పార్టీ పనులు అంటూ నిత్యం ఆలోచనలతో ఉండటం వలనే ఇలా జరిగిందని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని వారు విఙ్ఞప్తి చేసినట్లు టాక్. దీంతో రజనీకాంత్ కూడా కాస్త ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.
అయితే మరోవైపు రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి అన్ని పనులు యథాతథంగా జరుగుతున్నాయని నిర్వాహకులు తమిళరువి మణియన్ చెప్పారు. ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇక రజనీ మక్కల్ మండ్రం నిర్వాహకులు మాట్లాడుతూ.. సభలకు రజనీకాంత్ ప్రత్యక్షంగా హాజరుకానున్నా.. ఆయన పార్టీ ప్రకటన చేస్తే చాలాని అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనన్న ఉత్కంఠ అందరిలో పెరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajinikanth