Rajinikanth | రజినీకాంత్ నటించే సినిమాల్లో ఇన్ని మలుపులు ఉంటాయో ఉండవో.. కానీ.. రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అన్ని బాగుంటే.. ఈ పాటికి ఆయన రాజకీయ పార్టీ స్థాపించి ఉండేవారు. కానీ కరోనా రజినీకాంత్ పొలిటికల్ పార్టీ కలను మొగ్గలోనే తుంచివేసినట్టు సమాచారం. ప్రస్తుతం రజినీకాంత్ వయసు 70 సంవత్సరాలు. మరోవైపు ఎన్నికలు అంటే మాములు విషయం కాదు. ప్రజల్లో వెళ్లాలి. ఇపుడున్న కరోనా పరిస్థితుల్లో రజినీకాంత్ వయసు ఆరోగ్యం అందుకు సహకరించడం అంత తేలిక కాదు.అందుకే వచ్చే తమిళనాడు ఎన్నికల వరకు రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం డౌటే అంటున్నారు ఆయన సన్నిహిత మిత్రలు. ప్రస్తుతం రజినీకాంత్.. అన్నాత్తే షూటింగ్ సినిమా చేస్తున్నాడు.
సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఎంతో పెండింగ్‌లో ఉంది. ఐతే.. రజినీకాంత్.. నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొనలనుకున్నారు. కానీ రీసెంట్గా 74 ఏళ్ల గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఓ రియాలిటీ షో షూటింగ్ సందర్భంగా కరోనాకు గురి కావడం.. ఆ తర్వాత కన్నుమూయడం అందరికీ తెలిసిందే కదా.
దీంతో రజినీకాంత్ కరోనా వాక్సిన్ వచ్చే వరకు ’అన్నాత్తే’ సినిమాకు సంబంధించిన షూటింగ్‌తో పాటు బయట ప్రజలతో తిరిగే కార్యక్రమాలకు పులిస్టాప్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇక షెడ్యూల్ ప్రకారం తమిళనాడుకు 2021 మే వరకు ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంది. అప్పటి వరకు కరోనా వాక్సిన్ వచ్చేది డౌటే అని చెబుతున్నారు. రిస్క్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కంటే ఇపుడు సైలెంట్‌గా ఉండటమే బెటర్ అంటున్నారు. మరోవైపు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎన్నికల ప్రచారం కోసం టీవీ, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలను యూజ్ చేసుకున్నా.. ఎక్కడో ఓ చోట పబ్లిక్ మీటింగ్ లేనిది ఎన్నికలను ఎదుర్కొవడం అంత ఈజీ కాదంటున్నారు రజినీకాంత్ సన్నిహితులు.
అయితే.. రజినీకాంత్ మాత్రం ఇప్పటికే రాజకీయాల్లో వస్తానంటూ ప్రకటించినా.. పార్టీ పేరు.. మ్యానిఫేస్టో ప్రకటించలేదు. ఇక రజినీకాంత్ పార్టీ పెట్టడమే ఆలస్యం వెంటనే పార్టీలో చేరిపోవాలనుకున్న తలైవా అభిమానులకు ఇపుడీ వార్త మింగుడు పడటం లేదు.మరోవైపు రజినీకాంత్ 2021లో జరిగే తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. త్వరలో ఒక దేశం ఒక ఎన్నికలకు సంబంధించిన బిల్‌ను పార్లమెంట్లో పాస్ అయితే.. తమిళనాడుకు 2023లో కానీ 2024లో లోక్‌సభకు జరిగే ఎన్నికలతో పాటు మళ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే రజినీకాంత్ 2021లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ పడటం కంటే లోక్‌సభ ఎన్నికలతో పాటు తమిళనాడుకు (ఒక వేళ బిల్ పాస్ అయితే..) జమిలీ ఎన్నికలపుడు తమిళనాడులో రంగంలోకి దిగితే.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఒకేసారి అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొవచ్చేనేది రజినీకాంత్ అభిప్రాయం. మరి ఈ డిసెంబర్ 12న రజినీకాంత్ 70 ఏళ్లు పూర్తి చేసుకోనున్నాడు. ఈ సందర్భంగా ఆయన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కోరకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona virus, Kollywood, Rajinikanth, Tamilnadu