Petta Telugu Movie Twitter Review: పక్కా మాస్ మూవీ ‘పేట’...ట్విట్టర్‌లో సూపర్ హిట్ టాక్

Petta Telugu Movie Twitter Review | ‘పేట’ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలకు భిన్నంగా...ఈ సినిమాలో 90ల నాటి పాత తలైవాను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మళ్లీ తెరపైన చూపించారని అభిమానులు చెబుతున్నారు.

news18-telugu
Updated: January 10, 2019, 2:07 PM IST
Petta Telugu Movie Twitter Review: పక్కా మాస్ మూవీ ‘పేట’...ట్విట్టర్‌లో సూపర్ హిట్ టాక్
‘పేట’ చిత్రంలో రజనీకాంత్
  • Share this:
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ ‘పేట’ భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ చిత్రాన్ని తొలి రోజు, తొలి ఆట చూసిన ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. తమిళంలో ‘పేట్టా’గా తెలుగులో ‘పేట’గా ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘2.O’ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీకాంత్ చిత్రమిది. ‘పేట’ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలకు భిన్నంగా...ఈ సినిమాలో 90ల నాటి పాత తలైవాను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మళ్లీ తెరపైన చూపించారని అభిమానులు చెబుతున్నారు. గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో రజనీకాంత్ మాస్ మసాలాతో అదరగొట్టారని అంటున్నారు. ‘పేట’ బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందంటూ తమ ట్విట్టర్ రివ్యూలలో ధీమా వ్యక్తంచేస్తున్నారు.

రజనీకాంత్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి పండుగ జోష్‌ను ఈ చిత్రం హిట్ టాక్ రెట్టింపు చేస్తోంది. రజనీకాంత్ సినిమాను థియేటర్‌కు వెళ్లి చూడాలని ప్రతి అభిమాని గర్వంగా చెప్పుకునేలా ఈ చిత్రం ఉందని ఓ అభిమాని ట్వీట్ చేశారు.

petta review, petta ticket booking, petta imdb, rajnikanth petta, rajnikanth fan marriage, marriage in theatre, పేట రివ్యూ, రజనీకాంత్ ఫ్యాన్ పెళ్లి
‘పేట’ చిత్రంలో రజనీకాంత్


















అటు పలువురు సినీ విమర్శకులు కూడా పేటకు మంచి రేటింగ్స్ ఇస్తున్నారు. ట్రేడ్ వర్గాలు కూడా సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.









కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ తెరకెక్కించిన ఈ చిత్రంలో సిమ్రాన్, త్రిష, విజయ్ సేతుపతి, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, మలయాళ నటుడు మణికండన్ ప్రధాన పాత్రలు పోషించారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ తమిళంలో నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చారు. రజనీకాంత్‌ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందించడం ఇదే తొలిసారి.

పేట చిత్రానికి హిట్ టాక్ వస్తుండడం పట్ల సినిమా యూనిట్ సంతోషం వ్యక్తంచేస్తోంది.





First published: January 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>