రజినీకాంత్‌కు గాయాలు.. ఆందోళనలో అభిమానులు..

Rajinikanth: ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే రజినీ.. ఇప్పుడు టీవీ షోతో బిజీగా ఉన్నాడు. ఈయన ప్రస్తుతం మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్‌లో ఉన్నాడు. అక్కడే షూటింగ్ చేస్తుండగా ఆయన ప్రమాదానికి గురయ్యారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 28, 2020, 9:09 PM IST
రజినీకాంత్‌కు గాయాలు.. ఆందోళనలో అభిమానులు..
సూపర్ స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth)
  • Share this:
ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే రజినీ.. ఇప్పుడు టీవీ షోతో బిజీగా ఉన్నాడు. ఈయన ప్రస్తుతం మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్‌లో ఉన్నాడు. అక్కడే షూటింగ్ చేస్తుండగా ఆయన ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ షూటింగ్ కర్ణాటకలో బందిపుర టైగర్ రిజర్వ్‌లో జరుగుతుంది. జనవరి 28 నుంచి మూడు రోజుల పాటు అక్కడ షెడ్యూల్ ప్లాన్ చేసారు. మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో భాగంగా ఆయన అక్కడే ఉన్నాడు. ఆ షో హోస్ట్ బేర్ గ్రిల్స్‌తో పాటు రజినీ ఈ షూటింగ్ చేస్తున్నాడు. షూట్ చేస్తున్నపుడు అనుకోకుండా రజినీ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన భుజానికి గాయాలయ్యాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth)
సూపర్ స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth)

అయితే గాయం తీవ్రత మరీ ఎక్కువేం కాదని.. స్వల్ప గాయాలే అని వైద్యులు తెలిపారు. దాంతో ఉన్నపలంగా ఆయన షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి చెన్నై వెళ్లిపోయాడు. రజినీ ప్రమాదం గురించి తెలుసుకుని ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. కొన్ని రోజుల కింద ఈ షోలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆయన తర్వాత ప్రముఖంగా వినిపించిన పేరు రజినీకాంత్. అయితే తొలిరోజే ఇలా రజినీ షూటింగ్‌లో గాయాల పాలు కావడం అభిమానులను కలవరపెడుతుంది. ఇదిలా ఉంటే ఈయన సిరుత్తై శివ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది త్వరలోనే మొదలు కానుంది.
Published by: Praveen Kumar Vadla
First published: January 28, 2020, 9:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading