Rajinikanth Vijay: రజినీకాంత్ వెనకడుగు.. అదే విజయ్‌కు వరంగా మారబోతుందా..?

రజినీకాంత్ విజయ్ (Rajinikanth Vijay)

Rajinikanth Vijay: తమిళనాట సినీ రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు రాజకీయాల్లో ఉన్నాడనుకున్న రజినీకాంత్ ఈ రోజు లేడు. ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసాడు. ఈ మధ్యే అనారోగ్యం..

  • Share this:
తమిళనాట సినీ రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు రాజకీయాల్లో ఉన్నాడనుకున్న రజినీకాంత్ ఈ రోజు లేడు. ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసాడు. ఈ మధ్యే అనారోగ్యం పాలు కావడంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కూతుళ్లతో పాటు భార్య లత.. అలాగే ఆయన సన్నిహితులు కూడా ఇప్పుడు రాజకీయాలు వద్దు అంటూ వారించడంతో తప్పక రజినీ కూడా వాళ్ల మాటలకు సరే అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు వస్తాడనుకున్న రజినీకాంత్ తప్పుకోవడంతో అంతా షాక్ అవుతున్నారు. అంతేకాదు తమిళ రాజకీయాల్లో తెలియని స్తబ్ధత కూడా కనిపిస్తుంది. రజినీకాంత్ వచ్చుంటే కచ్చితంగా మార్పు వస్తుందని నమ్మిన అభిమానులు ఇప్పుడు సడన్ షాక్‌లోకి వెళ్లిపోయారు. అయితే సినిమా వాళ్లకు రాజకీయాలు అంతగా ఏం తెలుసు అనే వాళ్లు కూడా లేకపోలేదు. 70 ఏళ్ల వయసులో ఇప్పుడు పార్టీ స్థాపించి రజినీ వచ్చి కొత్తగా ఏం చేస్తాడంటూ ఎద్దేవా చేసిన వాళ్లు కూడా లేకపోలేదు. ఆయన సన్నిహితులు కూడా ఈ వయసులో పార్టీ స్థాపించి రాజకీయాలు చేసి అనవసరంగా లేనిపోని టెన్షన్స్ అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తుంది.
rajinikanth,rajinikanth politics,vijay party name,rajinikanth party name,vijay politics,thalapathy vijay movies,rajinikanth drops from politics,విజయ్,రజినీకాంత్,రజినీకాంత్ పాలిటిక్స్
రజినీకాంత్ విజయ్ (Rajinikanth Vijay)

ఇదంతా విన్న తర్వాతే రజినీకాంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇదిలా ఉంటే రజినీ రానని చెప్పడంతో ఇదే విజయ్‌కు వరంగా మారబోతుంది. చాలా ఏళ్లుగా ఈయన రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన అభిమాన సంఘాల నుంచి ఎన్నో మంచి పనులు చేస్తుంటాడు విజయ్. తమిళనాడులోనే ఆయనకు వందల సంఖ్యలో అభిమాన సంఘాలున్నాయి. దానికితోడు ఈయన సినిమాలు కూడా ఈ మధ్య ఎక్కువగా పొలిటికల్ టచ్‌తోనే వస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత విజయ్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అనే ప్రచారం జరుగుతుంది. కానీ ఆయన మాత్రం అలాంటిదేం లేదని చెప్పాడు.
rajinikanth,rajinikanth politics,vijay party name,rajinikanth party name,vijay politics,thalapathy vijay movies,rajinikanth drops from politics,విజయ్,రజినీకాంత్,రజినీకాంత్ పాలిటిక్స్
రజనీకాంత్ (File Image)

విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఈ మధ్యే విజయ్ పేరుతో ఓ పార్టీ స్థాపించాడు. అయితే దానికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు విజయ్. అందులో చేరొద్దంటూ తన అభిమానులకు కూడా చెప్పాడు విజయ్. అది పూర్తిగా తన తండ్రి చంద్రశేఖర్ అభిప్రాయమే అని.. తనకు సంబంధం లేదని చెప్పాడు. అయితే ఇన్నాళ్లూ రజినీ వస్తాడు కాబట్టి విజయ్ రావట్లేదు అన్నారు.. ఇప్పుడు రజినీ డ్రాప్ అవడంతో విజయ్ తన మనసు మార్చుకుంటాడా అనేది చూడాలి. ప్రస్తుతం ఈయన మాస్టర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు నెల్సన్ దర్శకత్వంలో తర్వాతి సినిమా చేయబోతున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published: