తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి స్వల్ఫ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నిన్న సాయంత్రం చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారని వచ్చాయి. అయితే ఆయన ఆరోగ్యం విషయంలో అభిమానులు అందోళన పడాల్సింది ఏమీ లేదని సన్నిహితులు తెలిపారు. సాధారణ వైద్య పరీక్షల కోసమై గురువారం నాడు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారని రజనీకాంత్ సన్నిహితులు తెలిపారు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. రజనీకాంత్ ప్రస్తుతం 'అన్నాత్తే' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో తెలుగులో పెద్దన్నగా విడుదలవుతోంది. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకడు శివ ఇటు మాస్, అటు క్లాస్ రెండు వర్గాలను ఆకట్టుకోగలడు. అందులో భాగంగా వారిచేత విజిల్ వేయించగలరు. దర్శకుడు శివ గతంలో అజిత్ కుమార్‌తో ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు తీసి.. తమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు.
శివ రజనీకాంత్ (Rajinikanth)కాంబినేషన్’లో వస్తుండడంతో చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదలై అదరగొట్టింది. ట్రైలర్‌ను చూస్తుంటే సిస్టర్ సెంటిమెంట్‌తో సినిమా వస్తుందని తెలుస్తోంది.
ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే.. మామూలుగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అంటే పంచ్‌డైలాగ్‌లకు కొదువుండదు. తనదైన శైలిలో యాక్టింగ్ చేస్తూ రజనీ పలికే సంభాషణలు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుంటాయి. అందుకే రజనీకాంత్ సినిమా డైలాగ్స్ విషయంలో దర్శకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు రచయితలు.
Varudu Kaavalenu | Ritu Varma : వరుడు కావలెను బ్యూటీ రితూ వర్మ బ్యూటీఫుల్ పిక్స్..
కాగా రజనీ ఈ సినిమా కోసం సొంతంగా సంభాషణలు రాశారట. ఇక ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో నయనతార (Nayanthara) కీర్తిసురేష్ లు కనిపించనున్నారు. మరో కీలక పాత్రలో ప్రకాష్‌రాజ్ నటించారు. ఇక ఈ తాజా సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్నందని సమాచారం.
ఈ సినిమాలో రజనీకాంత్ ఊరి పెద్దగా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ సినిమాను సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో తెలుగు టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. అన్నాత్తే నవంబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Akash Puri Romantic Twitter Review : ఆకాష్ పూరీ రొమాంటిక్ ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ..
ఇక అన్నాత్తే కంటే ముందు రజనీ దర్భార్ అంటూ వచ్చాడు. మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మధ్య సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న రజనీకాంత్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు ఆయన అభిమానులు. ఇక రజనీకాంత్ ఇటీవలే.. భారతీయ సినిమా అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఈ అవార్డ్‌ను ఆయన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి చేతులు మీదుగా అందుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajinikanth, Tollywood news