హోమ్ /వార్తలు /సినిమా /

సమంత అక్కినేనికి థ్యాంక్స్ చెప్పిన నమ్రత... మీరు మా ఫ్యామిలీ ఫేవరెట్ అంటూ పోస్ట్...

సమంత అక్కినేనికి థ్యాంక్స్ చెప్పిన నమ్రత... మీరు మా ఫ్యామిలీ ఫేవరెట్ అంటూ పోస్ట్...

సమంత అక్కినేనికి థ్యాంక్స్ చెప్పిన నమ్రత... మీరు మా ఫ్యామిలీ ఫేవరెట్ అంటూ పోస్ట్...

సమంత అక్కినేనికి థ్యాంక్స్ చెప్పిన నమ్రత... మీరు మా ఫ్యామిలీ ఫేవరెట్ అంటూ పోస్ట్...

సమంత అక్కినేనికి థ్యాంక్స్ చెబుతూ వీడియో పోస్ట్ చేసిన నమ్రత శిరోద్కర్... ‘మహర్షి’ సినిమా ప్రమోషన్‌లో యమా బిజీగా గడుపుతున్న నమ్రత...

సమంత అక్కినేని టైమ్ మామూలుగా లేదు. ప్రియమైన భర్త అక్కినేని నాగచైతన్యతో ‘మజిలీ’ చిత్రంలో నటించిన సమంత అక్కినేని... ఫ్లాపుల్లో ఉన్న చైతూకీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించింది. అటు కోలీవుడ్‌లో విజయ్ సేతుపతితో చేసిన ‘సూపర్ డీలక్స్’ సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పెళ్లైన తర్వాత చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్న సమంత అక్కినేనికీ, మహేష్ బాబు ముద్దుల కూతురు సితారకు మంచి స్నేహం ఉందనే విషయం తెలిసిందే. ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బ్రహ్మోత్సవం’ వంటి చిత్రాల్లో మహేష్ బాబుతో కలిసి నటించిన సమంత అక్కినేని... సూపర్ స్టార్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానంటూ చెప్పుకొచ్చింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఆడియో రిలీజ్ సమయంలో సితార, సమంత కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ సినిమా తర్వాత కూడా ఇద్దరి మధ్య స్నేహం అలాగే కొనసాగింది. తాజాగా మరోసారి మహేష్ గురించి చెబుతూ ఓ వీడియో విడుదల చేసింద సమంత అక్కినేని. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 25వ చిత్రం ‘మహర్షి’ మే 9న విడుదల కాబోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఢీజే’ బ్యూటీ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్ ముఖ్యపాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా టాలీవుడ్ హీరోయిన్స్, డైరెక్టర్స్, స్టార్స్‌తో ప్రమోషన్ వీడియోలు చేయిస్తోంది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా సమంత అక్కినేని, మహేష్ బాబు గురించి చెబుతూ ఓ వీడియో రూపొందించింది. ఇందులో తాను ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చానని... తనకు సూపర్‌స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశం ఎంతో గౌరవంగా భావిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది.

నమ్రత శిరోద్కర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సమంత అక్కినేని వీడియో...


మహేష్ బాబు ప్రతీ సినిమాను మొదటి సినిమాగా అనుకొమ్మని సలహా ఇచ్చారని, దాన్ని ఆచరణలో పెట్టడం వల్లే తానీ స్థాయిలో ఉన్నానంటూ చెప్పింది సమంత అక్కినేని. ప్రతీ సింగిల్ షాట్ కోసం మహేష్ బాబు ఎంతో కష్టపడతాడని, ‘మహర్షి’ సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపింది అక్కినేని వారి కోడలు. ‘మహర్షి’ సినిమాను విష్ చేస్తూ సమంత అక్కినేని చేసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌‌లో పోస్ట్ చేసింది నమ్రత శిరోద్కర్. ‘మీరు మా ఫ్యామిలీ ఫేవరెట్ సామ్.. సితారకు మీరంటే పిచ్చి... మహర్షి సినిమా విజయం సాధించాలని విష్ చేసిన మీరు థ్యాంక్యూ సో... మచ్!’ అంటూ కామెంట్ పెట్టింది నమ్రత శిరోద్కర్. సమంత అక్కినేనితో పాటు గుణశేఖర్, ఎస్‌జే సూర్య, బి గోపాల్, జయంత్ సి పరాన్జీ, ఇలియానా, త్రివిక్రమ్, శ్రీనువైట్ల, సుకుమార్, కృతి సనన్... ‘మహర్షి’ సినిమా విజయాన్ని కాంక్షిస్తూ మాట్లాడిన వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది నమ్రత శిరోద్కర్.

Published by:Ramu Chinthakindhi
First published:

Tags: Mahesh babu, Maheshbabu25, Namrata, Samantha, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు