SUPERSTAR MAHESH BABU USED AP CM YS JAGAN IMAGE FOR SARILERU NEEKEVVARU MOVIE PROMOTIONS PK
జగన్‌ను అలా వాడేసుకున్న మహేష్.. సరిలేరు నీకెవ్వరు బాబు..
మహేష్ బాబు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
నమ్మడానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు నిజంగానే జగన్ ఇమేజ్ను తన సినిమా కోసం వాడేసుకున్నాడు మహేష్ బాబు. అయినా రాజకీయ నాయకులను వాడుకోవడంలో రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ముందుంటాడు..
నమ్మడానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు నిజంగానే జగన్ ఇమేజ్ను తన సినిమా కోసం వాడేసుకున్నాడు మహేష్ బాబు. అయినా రాజకీయ నాయకులను వాడుకోవడంలో రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ముందుంటాడు కానీ ఇప్పుడు ఆయన దారిలో మహేష్ వెళ్తున్నడు. ప్రస్తుతం ఈయన సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగానే జరుగుతున్నాయి. మహేష్ బాబు ప్రస్తుతం ఫారెన్ టూర్ ప్లాన్ చేస్తున్నాడు. దాంతో ప్రమోషన్ బాధ్యతలు నిర్మాతలతో కలిసి దర్శకుడు అనిల్ రావిపూడి చూసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ప్రతి సోమవారం ఓ పాటను విడుదల చేస్తున్నారు.
తమన్నా మహేష్ బాబు ఫైల్ పోటోస్
ఈ క్రమంలోనే డిసెంబర్ 28 సాయంత్రం సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ఐటం సాంగ్ ప్రోమో విడుదల చేసారు. ఈ ఫుల్ సాంగ్ డిసెంబర్ 30న అంటే సోమవారమే విడుదల కానుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. విశాఖ నగరంలోని 'విశాఖ ఉత్సవ్' వేడుకలలో సరిలేరు నీకెవ్వరు సాంగ్ ప్రోమోను విడుదల చేసారు. 'వెల్ కం టు 2020 విత్ ఏ బ్యాంగ్.. డాంగ్ డాంగ్ ది పార్టీ సాంగ్' అంటూ ఈ పాటను విడుదల చేసాడు దేవీ. విశాఖ ఉత్సవ్‌కు వచ్చిన వేలాది మంది ఈ పాటను ఫుల్‌గా ఎంజాయ్ చేసారు. ఇక్కడే అసలు ప్రమోషన్ దాగుంది. డిసెంబర్ 28న విశాఖపట్నం బాగా ట్రెండ్ అయింది. దానికి కారణం జగన్ రావడమే. విశాఖపట్టణంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు.
మహేష్ బాబు జగన్
అలాంటి సమయంలో విశాఖ ఉత్సవాలు చూడడానికి విశాఖ బీచ్ ప్రాంతానికి చేరుకున్నారు ప్రేక్షకులు కూడా. ఈవేడుకకు ఉత్తరాంధ్ర అన్ని జిల్లాల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలి రావడంతో దాదాపు 2500 మంది పోలీసులు నగరాన్ని పహరా కాసారు. ఇక ఈ ఉత్సవంలో 24 కిలోమీటర్ల మేర జరిగిన హ్యూమన్ చెయిన్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమానికి హైలెట్. మరోవైపు విశాఖపట్నం ఆంద్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని కాబోతోందంటూ వార్తలొస్తున్న సమయంలో తన సినిమా ప్రమోషన్ కోసం కూడా ఇదే నగరాన్ని వాడుకున్నాడు సూపర్ స్టార్. విశాఖ ఉత్సవ్‌లో సరిలేరు నీకెవ్వరు పాటను విడుదల చేయడంతో రాత్రికి రాత్రే ట్రెండ్ అయిపోయింది. ఏదేమైనా కూడా తనకు రాజకీయాలు తెలియవు అంటూనే తన సినిమా కోసం అన్నీ చేస్తున్నాడు సూపర్ స్టార్.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.