హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu: మహేష్ బాబు దూకుడు మాములుగా లేదుగా.. అపుడే దుబాయ్ షెడ్యూల్ ఫసక్..

Mahesh Babu: మహేష్ బాబు దూకుడు మాములుగా లేదుగా.. అపుడే దుబాయ్ షెడ్యూల్ ఫసక్..

మహేష్ బాబు (Mahesh Babu)

మహేష్ బాబు (Mahesh Babu)

Mahesh Babu SSMB 27| ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు  ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన దుబాయ్ షెడ్యూల్ కంప్లీట్ అయింది.

ఇంకా చదవండి ...

  Mahesh Babu SSMB 27| ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు  ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, మహేష్ బాబు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో ప్రారంభమైంది. ఫస్ట్ షెడ్యూల్లో మహేష్ బాబు, కీర్తి సురేష్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పటకే దుబాయ్‌లో మహేష్ బాబు షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు లీకైయ్యాయి.  ఈ షెడ్యూల్లో మహేష్ బాబు, కీర్తి సురేష్ లపై పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా  దుబాయ్‌కు సంబంధించిన షెడ్యూల్ ఆదివారంతో కంప్లీటైంది. ఇప్పటికే దుబాయ్‌లో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను పిక్చరైజ్ చేసారు. సినిమాలో ఈ యాక్షన్ సీన్స్ హైలెట్ అని చెబుతున్నారు.

  దుబాయ్ షెడ్యూల్ తర్వాత ‘సర్కారు వారి పాట’ తర్వాతి షెడ్యూల్‌ను గోవాలో ప్లాన్ చేయనున్నట్టు సమాచారం. మహేష్ బాబు.. సర్కారు వారి పాట షూటింగ్‌లో భాగంగా దుబాయ్‌లో ప్రపంచంలోనే తొలి స్మార్ట్  పోలీస్ స్టేషన్‌ను సందర్భించారు.మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా విషయానికొస్తే..  ఈ మూవీని పరుశురామ్ సోషల్ మెసేజ్‌ కథతో తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో ముఖ్యంగా బ్యాకింగ్ రంగంలో అవినీతికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

  Superstar Mahesh Babu Sarkaru Vaari Paata Dubai Schedule Completed,Mahesh Babu: మహేష్ బాబు దూకుడు మాములుగా లేదుగా.. అపుడే దుబాయ్ షెడ్యూల్ ఫసక్..,Mahesh Babu,Sarkaru Vaari Paata,Mahesh Babu Sarkaru Vaari Paata dubai Schedule Completed,Mahesh babu Twitter,Mahesh babu Instagram,Mahesh Babu Facebook,Mahesh babu Dubai Police Station,Tollywood,మహేష్ బాబు,మహేష్ బాబు సర్కారు వారి పాట,సర్కారు వారి పాట,మహేష్ బాబు పోలీస్ స్టేషన్,దుబాయ్ పోలీస్ స్టేషన్‌లో మహేష్ బాబు,సర్కారు వారి పాట దుబాయ్ షెడ్యూల్ పూర్తి
  సర్కారు వారి పాటలో మహేష్ బాబు (Sarkaru Vaari Pata movie)

  భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాలో వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని హీరో మహేష్ ఎలా తిరిగి రాబట్టాడు. దానికి సంబందించి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది.ఇక మరోవైపు సోషల్ మెసేజ్‌తో పాటు అదిరిపోయే రొమాంటిక్ సీన్స్ ఉంటాయట. అందులో భాగంగా చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారి తండ్రి కొడుకులుగా త్రిపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ విలన్ పాత్రలో నటించడం దాదాపు ఖాయం అయింది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Keerthy Suresh, Mahesh Babu, Mythri Movie Makers, Sarkaru Vaari Paata, Tollywood

  ఉత్తమ కథలు