• Home
 • »
 • News
 • »
 • movies
 • »
 • SUPERSTAR MAHESH BABU NEW LOOK FOR SARKARU VAARI PAATA GOES VIRAL MNJ

Mahesh Babu: వైర‌ల్‌గా మహేష్ బాబు న్యూలుక్‌.. నీ లుక్‌ మైండ్ బ్లాక్ అంటోన్న ఫ్యాన్స్‌

మహేష్ బాబు

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు(Mahesh Bbau) అందం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఒంటి మీదికి 45 ఏళ్లు వ‌చ్చినట్లు ఆయ‌న అస్స‌లు క‌నిపించ‌రు. త‌న అందంతో ఇప్ప‌టి హీరోల‌కు కూడా గ‌ట్టి పోటీ ఇస్తున్నాడు మ‌హేష్.

 • Share this:
  Mahesh Babu: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు అందం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఒంటి మీదికి 45 ఏళ్లు వ‌చ్చినట్లు ఆయ‌న అస్స‌లు క‌నిపించ‌రు. త‌న అందంతో ఇప్ప‌టి హీరోల‌కు కూడా గ‌ట్టి పోటీ ఇస్తున్నాడు మ‌హేష్. ఆయ‌నలాంటి అందం కావాల‌ని కోరుకునే సెల‌బ్రిటీలు కూడా చాలా మందే ఉన్నారు. కాగా ప్ర‌స్తుతం మ‌హేష్, ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట‌లో న‌టించేందుకు రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీలో మ‌హేష్ కొత్త లుక్‌లో కనిపించ‌నున్నారు. ఇందుకోసం సూప‌ర్‌స్టార్ ఎప్ప‌టినుంచో రెడీ అవుతున్నారు. గ‌డ్డం లేకుండా వెంట్రుక‌ల‌ను మ‌రింత పెంచుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఓ వెడ్డింగ్‌కి భార్య న‌మ్ర‌త‌తో స‌హా మ‌హేష్ హాజ‌ర‌వ్వ‌గా.. దానికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఆ ఫొటోల‌ను చూసిన అభిమానులు నీ లుక్ మైండ్ బ్లాంక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

  కాగా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా తెర‌కెక్క‌బోతున్న ఈ మూవీలో మ‌హేష్ ద్విపాత్రాభిన‌యంలో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో మ‌హేష్ బాబు స‌ర‌స‌న కీర్తి సురేష్ తొలిసారిగా జ‌త‌క‌ట్ట‌బోతోంది. అలాగే విద్యా బాల‌న్, అర‌వింద్ స్వామి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్న‌ట్లు టాక్. మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, మ‌హేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.  క‌థానుగుణంగా ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలోనే చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంది. ఇందుకోసం అక్క‌డ ప్ర‌య‌త్నాలు మొద‌లైన‌ట్లు తెలుస్తుండ‌గా.. వచ్చే నెల‌లో స‌ర్కారు వారి పాట యూనిట్ అమెరికాకు వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. అక్క‌డ దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధాన తారాగ‌ణం మొత్తం ఇందులో పాల్గొన‌బోతున్న‌ట్లు టాక్.
  Published by:Manjula S
  First published: