హోమ్ /వార్తలు /సినిమా /

‘మహర్షి’ ట్రైలర్ రిలీజ్... ఓడిపోవడమంటే భయమంటున్న సూపర్‌స్టార్...

‘మహర్షి’ ట్రైలర్ రిలీజ్... ఓడిపోవడమంటే భయమంటున్న సూపర్‌స్టార్...

‘మహర్షి’ ట్రైలర్ రిలీజ్... ఓడిపోవడమంటే భయమంటున్న మహేష్...

‘మహర్షి’ ట్రైలర్ రిలీజ్... ఓడిపోవడమంటే భయమంటున్న మహేష్...

ట్రైలర్‌లోనే కథ మొత్తం రివీల్ చేసేసిన చిత్ర యూనిట్... మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సూపర్ స్టార్ ‘మహర్షి’...

    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 25వ చిత్రం ‘మహర్షి’ సినిమా ట్రైలర్ విడుదలైంది. మార్చి 9న విడుదలవుతున్న ‘మహర్షి’ చిత్రంపై ట్రైలర్ భారీగా అంచనాలు పెంచేలా థియేట్రికల్ ట్రైలర్‌ను కట్ చేసింది చిత్ర యూనిట్. బుధవారం మార్చి1న హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో జరిగిన ‘మహర్షి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు విక్టరీ వెంకటేశ్. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో పాటు చిత్ర యూనిట్ హాజరయ్యారు. ‘ఏం సాధిద్దాం అనుకుంటున్నావ్ రిషీ’ అంటూ రావు రమేశ్ అడిగిన ప్రశ్నకు... ‘ఏలేద్దాం అనుకుంటున్నాను సార్... ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను సార్...’ అని మహేష్ బాబు చెప్పడంతో ట్రైలర్ మొదలవుతుంది. మొదటి షాట్‌లోనే ‘బిజినెస్ మాన్’ సినిమాను గుర్తు చేసిన ‘మహర్షి’ సినిమా ఆ తర్వాత ‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలను గుర్తుకు తెచ్చింది. ‘మనం గతంలో ఎక్కడున్నాం... ఇప్పుడెక్కడున్నాం అనే దాన్ని బట్టి మన సక్సెస్ తెలుస్తుంది’, ‘ఓడిపోతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం’, ‘ఓడిపోవడంటే నాకు భయం... ఓడిపోతాననే భయంతో ఇక్కడిదాకా వచ్చాను’ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్స్... అల్లరి నరేశ్ ఎంట్రీ, క్యారెక్టరైజేషేన్ కొత్తగా అనిపించాయి. పూజా హెగ్దే కొత్తగా ఎమీ కనిపించలేదు. ముఖ్యంగా ట్రైలర్ మొత్తం న్యూలుక్‌తో అదరగొట్టేశాడు మహేష్ బాబు. మొత్తంగా ట్రైలర్ చూస్తే సినిమా కథ క్లియర్‌గా అర్థమవుతోంది.


    సంపాదించడమే సక్సెస్ అనుకునే ఓ యువకుడు... కష్టపడి కోట్లు సంపాదిస్తాడు. లక్షల కోట్ల సంపద కూడా అతనికి జీవితంలో సంతృప్తిని ఇవ్వదు. దాంతో అన్నీ వదిలేసి స్నేహితుడిని వెతుక్కుంటూ వ్యవసాయం చేస్తాడు. ఇదే క్లుప్తంగా ‘మహర్షి’ కథ. ఈ సింపుల్ కథను దర్శకుడు వంశీ పైడిపల్లి ఎలా, ఎంత ఆసక్తికరంగా రూపొందించాడనే తెరపైన చూడాలి.


    ‘మహర్షి’ ట్రైలర్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...

    ' isDesktop="true" id="188794" youtubeid="ByjXIbg4hjw" category="movies">


    First published:

    Tags: #Maheshbabu25, Maharshi, Maharshi Movie Review, Mahesh, Mahesh babu, Tollywood

    ఉత్తమ కథలు