• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SUPERSTAR MAHESH BABU GIVEN A BUMPER OFFER TO DIRECTOR MEHER RAMESH WITH NAMRATA SHIRODKAR REFERENCE PK

మహేష్ ఆఫర్‌కు మెహర్ రమేష్ ఫిదా.. సక్సెస్ అవుతాడా..?

మహేష్ ఆఫర్‌కు మెహర్ రమేష్ ఫిదా.. సక్సెస్ అవుతాడా..?

మెహర్ రమేష్ మహేష్ బాబు నమ్రత శిరోద్కర్

హెడ్డింగ్ చూసిన తర్వాత కచ్చితంగా మహేష్ బాబు అభిమానులకు కాస్తో కూస్తో కంగారు ఖాయం కదా. ఎందుకంటే పాపం మెహర్ రమేష్ జాతకం అలా ఉంది మరి. తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేష్.

  • Share this:
హెడ్డింగ్ చూసిన తర్వాత కచ్చితంగా మహేష్ బాబు అభిమానులకు కాస్తో కూస్తో కంగారు ఖాయం కదా. ఎందుకంటే పాపం మెహర్ రమేష్ జాతకం అలా ఉంది మరి. తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేష్. కన్నడలో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన ఈయన తెలుగులో మాత్రం డిజాస్టర్ డైరెక్టర్ అయిపోయాడు. ఈయన చేసిన నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించలేక.. నిర్మాతలను కూడా నిండా ముంచేసాయి. దాంతో మెహర్ పేరు ఎత్తినేనే నిర్మాతలతో పాటు హీరోలు కూడా పారిపోతున్నారు. ఈయన చేసిన కంత్రి, బిల్లా, శక్తి, షాడో అన్నీ ఫ్లాపులే. దాంతో మెహర్ రమేష్‌ను నమ్మడం పూర్తిగా మానేసారు నిర్మాతలు.

Superstar Mahesh Babu giving a bumper offer to director Meher Ramesh with Namrata recommendation pk హెడ్డింగ్ చూసిన తర్వాత కచ్చితంగా మహేష్ బాబు అభిమానులకు కాస్తో కూస్తో కంగారు ఖాయం కదా. ఎందుకంటే పాపం మెహర్ రమేష్ జాతకం అలా ఉంది మరి. తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేష్. meher ramesh,meher ramesh mahesh babu,meher ramesh sarileru neekevvaru,meher ramesh distributor,meher ramesh sarileru neekevvaru guntur rights,meher ramesh namrata friendship,meher ramesh twitter,meher ramesh mahesh babu,namrata shirodkar twitter,meher ramesh movies,meher ramesh namrata shirodkar,meher ramesh web series,meher ramesh namrata shirodkar web series,meher ramesh instagram,meher ramesh mahesh babu movies,meher ramesh bobby,meher ramesh jagapathi babu,telugu cinema,మెహర్ రమేష్,మెహర్ రమేష్ డిస్ట్రిబ్యూటర్,మెహర్ రమేష్ గుంటూర్ రైట్స్ సరిలేరు నీకెవ్వరు,మెహర్ రమేష్ నమ్రత శిరోద్కర్,మెహర్ రమేష్ వెబ్ సిరీస్,తెలుగు సినిమా,మెహర్ రమేష్ మహేష్ బాబు
మెహర్ రమేష్ మహేష్ బాబు


ముఖ్యంగా షాడో సినిమా వచ్చి ఆరేళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈయన జోలికి ఎవరూ వెళ్లడం లేదు. మెగా కుటుంబానికి బంధువు కాబట్టి కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు ఈయన. ఎలాగూ యాక్షన్ సీన్స్ బాగా చిత్రీకరిస్తాడని పేరుండటంతో పెద్ద సినిమాలకు అవి తెరకెక్కిస్తున్నాడు. దాంతో పాటు కొన్ని యాడ్స్ కూడా చేసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో మెహర్ రమేష్ పూర్తిగా సినిమాలుక దూరం అయిపోయాడు. ఆ మధ్య నమ్రత నిర్మాణంలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తాడనే వార్తలు వచ్చినా కూడా అవి కూడా నిజం కాలేదు. ప్రస్తుతం మహేష్ బాబు కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నాడు మెహర్. ఆయనతోనే యాడ్స్ కూడా చేస్తున్నాడు.

Superstar Mahesh Babu giving a bumper offer to director Meher Ramesh with Namrata recommendation pk హెడ్డింగ్ చూసిన తర్వాత కచ్చితంగా మహేష్ బాబు అభిమానులకు కాస్తో కూస్తో కంగారు ఖాయం కదా. ఎందుకంటే పాపం మెహర్ రమేష్ జాతకం అలా ఉంది మరి. తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేష్. meher ramesh,meher ramesh mahesh babu,meher ramesh sarileru neekevvaru,meher ramesh distributor,meher ramesh sarileru neekevvaru guntur rights,meher ramesh namrata friendship,meher ramesh twitter,meher ramesh mahesh babu,namrata shirodkar twitter,meher ramesh movies,meher ramesh namrata shirodkar,meher ramesh web series,meher ramesh namrata shirodkar web series,meher ramesh instagram,meher ramesh mahesh babu movies,meher ramesh bobby,meher ramesh jagapathi babu,telugu cinema,మెహర్ రమేష్,మెహర్ రమేష్ డిస్ట్రిబ్యూటర్,మెహర్ రమేష్ గుంటూర్ రైట్స్ సరిలేరు నీకెవ్వరు,మెహర్ రమేష్ నమ్రత శిరోద్కర్,మెహర్ రమేష్ వెబ్ సిరీస్,తెలుగు సినిమా,మెహర్ రమేష్ మహేష్ బాబు
మెహర్ రమేష్ మహేష్ బాబు (Source: Twitter)


ఈ సాన్నిహిత్యంతోనే ఇప్పుడు మహేష్ బాబు ఈ దర్శకుడికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈయన నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో మెహర్ డిస్ట్రిబ్యూటర్ అవతారం ఎత్తాడు. గుంటూర్ ఏరియా రైట్స్ మెహర్ రమేష్ తీసుకున్నాడు. ఈయనకు రావడం వెనక నమ్రత హ్యాండ్ ఉందనేది ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. తమ కుటుంబంతో ఉన్న స్నేహం కారణంగానే మెహర్ రమేష్‌కు దగ్గరుండి మరీ నిర్మాతలతో చెప్పి గుంటూర్ రైట్స్ ఇప్పించిందని ప్రచారం జరుగుతుంది. ఈ ఏరియాలో ఇప్పటికే అడ్వాన్సుల రూపంలోనే మెహర్‌కు పెట్టుబడి వచ్చేసిందని.. రేపు సంక్రాంతికి సినిమా విడుదలైన తర్వాత లాభాలు ఖాయం అంటున్నారు. మరి చూడాలిక డిస్ట్రిబ్యూటర్‌గా మెహర్ ఏం మాయ చేస్తాడో..?
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు