Mahesh Babu-Janhvi Kapoor: సూపర్‌స్టార్ మహేష్ బాబు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా.. శ్రీదేవీ తనయ జాన్వీ కపూర్ మహేష్ బాబుతో జత కట్టబోతోందా అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి ఫిలింనగర్ వర్గాల్లో. అంతేకాదు దానికి సంబంధించిన పనులు కూడా ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు వివరాల్లోకి వెళితే.. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో మహేష్ సరసన కీర్తి సురేష్ జత కట్టింది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరగుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇదిలా ఉంటే ఈ మూవీ తరువాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్నట్లు ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. మహేష్‌తో సినిమాను ఎప్పుడో ప్రకటించారు రాజమౌళి. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత మహేష్‌తో జక్కన్న సెట్స్ మీదకు వెళతారని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం కంటే ముందు మహేష్, ఓ బాలీవుడ్ దర్శకుడితో పనిచేయబోతున్నట్లు సమాచారం.
బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఇప్పుడు తెలుగు హీరోలపై ఎక్కువ దృష్టిని పెట్టారు. ఇక్కడ మంచి క్రేజ్ ఉన్న హీరోలలో సినిమాలను చేసేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రానికి ఆయన ఒక నిర్మాతగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ బడా దర్శకనిర్మాత మహేష్‌తో సినిమాను చేయబోతున్నారట. ఒక కొత్త దర్శకుడితో ఈ సినిమా ఉండనుందని, ఇందులో మహేష్ సరసన జాన్వీ నటించనుందని తెలుస్తోంది. రాజమౌళిలో ఉండే చిత్రం ఎలాగూ పాన్ ఇండియాగా విడుదల కానుంది. అంతకంటే ముందు హిందీలో మూవీలో నటిస్తే క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్‌కు మహేష్ ఓకే చెప్పినట్లు టాక్. దీనికి సంబంధించిన పనులు ఇప్పుడు జరుగుతుండగా.. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు కూడా సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Janhvi Kapoor, Mahesh babu