నింగికెగసిన సూపర్ స్టార్ కృష్ణ నట జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో సాహసాలు, మరెన్నో ఆసక్తికరమైన విషయాలు జరిగాయి. ఇండస్ట్రీలో హీరోగా ఎక్కువ సినిమాల్లో నటించడమే కాకుండా తన ఇద్దరు కొడుకులు రమేష్‌బాబు(Ramesh Babu), మహేష్‌బాబు(Mahesh Babu)ను హీరోగాలు చేసి తాను కూడా అదే సినిమాలో హీరోగా ముగ్గురూ అన్నదమ్ములుగా నటించడం తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంత వరకు ఎవరూ చేయని ప్రయోగమనే చెప్పాలి. సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) ముగ్గురు కొడుకులు సినిమాతో హీరోగా,తండ్రిగా, డైరెక్టర్(Director)గా కూడా సక్సెస్ అయ్యారు. అయితే ఈ సినిమా క్రెడిట్ మాత్రం కృష్ణది కాదు. ఎందుకంటే హనుమంతరావు, నాగరత్నమ్మ (Nagaratnamma)దంపతులకు ముగ్గురు కొడుకులు వారిలో ఒకరే సూపర్ స్టార్ కృష్ణ. మిగిలిన ఇద్దరిలో ఒకరు హనుమంతరావు(Hanumantha Rao)మరొకరు ఆదిశేషగిరిరావు(Adiseshagiri Rao). తనకు ముగ్గురు కొడుకు కాబట్టి ఆ టైటిల్‌తో ఓ సినిమా తీయాలన్నది కృష్ణ మాతృమూర్తి అయినటు వంటి నాగరత్నమ్మ కోరిక.
ముగ్గురు కొడుకులు మూవీ ...
అందుకే ఆ సినిమా స్టోరీ రెడీ చేసుకోకుండానే టైటిల్ రిజిస్టర్ చేయించారు నాగరత్నమ్మ. ఆ తర్వాత ముగ్గురు కొడుకు సినిమాకు కథ రాయమని పద్మాలయా సంస్థ సినిమాలకు రచయితగా వ్యవహరించే మహారధికి అప్పగించారు. ఏడాది పూర్తైన కథ సిద్ధం చేయకపోవడంతో సూపర్ స్టార్ మదర్‌కి కోపం వచ్చి కొడుకుతో చెప్పిందట. నేను కథ రాయమంటే మహారధి రాయలేదు..ఎలాగైనా ఈ స్టోరీ ఇప్పుడు రాయించాల్సిందేనని పట్టుబట్టడంతో సూపర్ స్టార్ తల్లి మాటను గౌరవించి ఆమెపై ఉన్న ప్రేమను తోసిపుచ్చలేక పరుచూరి బ్రదర్స్‌తో స్టోరీ సిద్ధం చేయమన్నారు. అయితే వాళ్లు రాసిన స్టోరీ కృష్ణకు నచ్చకపోవడంతో పి.సి.రెడ్డి, రచయిత భీసెట్టి కలిసి కూర్చుని కథ తయారు చేశారు. ఆ విధంగా ముగ్గురు కొడుకులు సినిమా స్టోరీ రెడీ చేశారు సూపర్ స్టార్.
కొడుకులు తాను హీరోగా ఒక చిత్రం..
అప్పటికే స్కూల్లో చదువుకుంటున్న మహేష్‌కి ఇబ్బంది కలగకుండా సెలవుల్లో మాత్రమే షూటింగ్ జరిపేలా ప్లాన్ చేశారు. సూపర్ స్టార్ ఏదైనా చెప్పారో అదే విధంగా ఊటీ బ్యాక్‌డ్రాప్‌లో కథ సిద్ధం చేశారు.
సినిమాకు పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు. ఆ విధంగా తల్లి కోరిక తీర్చడం కోసం హీరో కృష్ణ తన ఇద్దరు కొడుకులకు అన్నగా నటించడమే కాకుండా తన తల్లి ముచ్చట పడి కోరిన సినిమా కావడం వల్లే ముగ్గురు కొడుకులు సినిమాకు నిర్మాతగా కృష్ణ తన తల్లి పేరు నాగరత్నమ్మను టైటిల్స్‌లో వేయించారు.
అమ్మ కోరిక తీర్చిన కొడుకు కృష్ణ ..
అప్పటికే స్టార్ హీరోగా ఉన్న కృష్ణ ఈసినిమాతో డైరెక్టర్‌గా మారారు. తన తండ్రి ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరికి అంకితమిచ్చారు. 1988 అక్టోబర్ 20న ముగ్గురు కొడుకులు చిత్రం విడుదలైంది. తను ఎంతో ముచ్చటపడి తీయించిన ఈ చిత్రం హిట్ అయినందుకు నాగరత్నమ్మ ఎంతో సంతోషించారు. సినిమా వంద రోజుల వేడుకలో పాల్గొనకుండానే కన్నుమూశారు. ఆవిధంగా ముగ్గురు కొడుకులు సినిమా కృష్ణ నిజ జీవితంలో ..సినిమా కెరియర్లో మైల్ స్టోన్‌గా మెమరబుల్ పిక్చర్‌గా నిలిచిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.