హోమ్ /వార్తలు /సినిమా /

Krishna Passed Away : సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు.. ప్రముఖుల సంతాపం..

Krishna Passed Away : సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు.. ప్రముఖుల సంతాపం..

Superstar Krishna is no more Photo : Twitter

Superstar Krishna is no more Photo : Twitter

Krishna Passed Away : భార్య ఇందిరా దేవి, పెద్దకుమారుడు రమేష్ బాబు మరణాల తర్వాత కృంగిపోయిన కృష్ణ అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించింది.  కృష్ణ మరణవార్తతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ (79) (Super Star Krishna Passes away)  ఇకలేరు. ఇవాళ తెల్లవారుఝామున 4.10 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటూ  కన్నుమూశారు. నిన్న గుండెపోటు, శ్వాస ఇబ్బందులతో  హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో కృష్ణ అడ్మిట్ అయ్యారు. శరీరంలోని ప్రధానమైన అవయవాలేవీ పనిచేయలేదు.  వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. ఆయన (Super Star Krishna Passes away) కోలుకోలేదు. వైద్యానికి శరీరం సరిగా స్పందించలేదు.  క‌ృష్ణ ఆరోగ్య విషమంగానే ఉందని నిన్న మధ్యాహ్నం డాక్టర్లు కూడా చెప్పారు. ఇక 48 గంటలు గడిస్తే గానీ.. ఏమీ చెప్పలేదని తెలిపారు. కృష్ణ కోలుకోవాలని అభిమానులంతా పూజలు చేశారు. కానీ వైద్యులు ప్రయత్నాలు గానీ.. అభిమానుల పూజలు గానీ ఫలించలేదు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఇటీవల భార్య ఇందిరా దేవి, ఆ మధ్య పెద్దకుమారుడు రమేష్ బాబు మరణాల తర్వాత కృంగిపోయిన కృష్ణ అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించింది.

కృష్ణ మరణవార్తతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ పెద్దలు దిగ్భ్రాంతికి గురైయ్యారు. ధైర్యంగా ఉండాలంటూ కుమారుడుకు మహేష్ బాబుకు ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు. అభిమానులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒకే సంవత్సరంలో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి రమేష్ బాబు, ఇందిరా దేవి, కృష్ణ మరణించడంతో ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.

ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత..అభిమానులు సూపర్ స్టార్ గా పిలుచుకునే సినీ హీరో కృష్ణ (ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి, 79 ) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు.

నటుడు గా, నిర్మాత గా, దర్శకుడు గా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. 350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం అన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘీక చిత్రాల నటుడు గా కృష్ణ జనాదరణ పొందారని అన్నారు.

నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరో గా, సూపర్ స్టార్ గా సొంతం చేసుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, సినిమా నిర్మాణ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణ దేనన్నారు.

కృష్ణ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఇక మరోవైపు ఏపీ సీఎం జగన్ .. మహేష్ బాబు ఫ్యామిలీకి ప్రగాడ సానుభూతి తెలిపారు. అల్లూరి సీతారామ రాజు పాత్రను చిరస్థాయిగా నిలిపారని, తన కెరీర్‌లో ఎన్నో హిట్‌లు సాధించారని అన్నారు.

దివికేగిన నటశేఖరుడు.. సూపర్ స్టార్ కృష్ణ సినీ ప్రస్థానం..

కృష్ణ 1943, మే 31వ తేదీన గుంటూరు జిల్లాలోని తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు.. 1960లో ఏలూరు సి.ఆర్‌.రెడ్డి. కాలేజీలో బిఎస్సీ పూర్తి చేశారు. ఆయన నటించిన తొలి చిత్రం తేనె మనసులు. ఇప్పటి వరకు 340కి పైగా చిత్రాల్లో నటించారు. గూఢచారి 116తో ఇండస్ట్రీలో ఆయనకు గుర్తింపు లభించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో నటశేఖరుడు ట్రెండ్‌సెట్టర్‌ అనిపించుకున్న సందర్భాలు కోకొల్లలు. 1964-95 మధ్య ఏడాదికి 10 సినిమాల చొప్పు.. 300 సినిమాలు చేశారు. సినిమాల నటించడంతో పాటు డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌గానూ పనిచేశారు. 18 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.

ఆయన నటించిన తొలి చిత్రం 'తేనెమనసులు' ఫస్ట్‌ ఈస్ట్‌మన్‌ కలర్‌ సోషల్‌ చిత్రం. తొలి జేమ్స్‌బాండ్‌ చిత్రం 'గూఢచారి 116', తొలి కౌబారు చిత్రం 'మోసగాళ్ళకు మోసగాడు', తొలి తెలుగు సినిమా స్కోప్‌ 'అల్లూరి సీతారామరాజు', తొలి తెలుగు 70ఎంఎం సినిమా 'సింహాసనం', తొలి ఓ.ఆర్‌.డబ్ల్యు రంగుల చిత్రం 'గూడుపుఠాణి', తొలి ప్యూజీ రంగుల చిత్రం 'భలే దొంగలు', తొలి సినిమా స్కోప్‌ టెక్నో విజన్‌ చిత్రం 'దొంగల దోపిడి', తొలిసారి తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న చిత్రం 'అల్లూరి సీతారామరాజు' (తెలుగు వీర లేవరా..).. ఇలా ఎన్నో విభిన్న చిత్రాలతో ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

ఘట్టమనేని ఫ్యామిలీలో ఈ ఏడాది మూడో విషాదం. జనవరిలో కృష్ణ కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మరణించారు. సెప్టెంబరులో కృష్ణ సతీమణి ఇందిరా, మహేష్ బాబు తల్లి కన్నుమూశారు. ఇప్పుడు కృష్ణ కూడా మరణించారు. వరుస విషాదాలతో సూపర్ మహేష్ బాబు దు:ఖ సాగరంలో మునిగిపోయారు. ఆయనకు సినీ ప్రముఖలంతా ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు.

First published:

Tags: Krishna, Tollywood news