SUPERSTAR KRISHNA IN SARILERU NEEKEVVARU MOVIE AND HE WILL SHAKE LEG WITH HIS SON MAHESH BABU PK
సరిలేరు నీకెవ్వరు సినిమాలో కృష్ణ వచ్చేదెప్పుడో తెలుసా..?
తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మలతో మహేష్ బాబు (Facebook/Photo)
సరిలేరు నీకెవ్వరు సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రం కోసం మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ వేడుక జరిగిన తర్వాత.. ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు మరింతగా..
సరిలేరు నీకెవ్వరు సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రం కోసం మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ వేడుక జరిగిన తర్వాత.. ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ప్రీ రిలీజ్ వేడుకలో అనిల్ రావిపూడి చెప్పిన ఓ మాట సినిమాపై ఆసక్తి మరింత పెంచేసింది. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఉన్నారని చెప్పి అంచనాలు రెండింతలు చేసాడు అనిల్. అయితే ఆయన ఎలా కనిపిస్తారు.. ఎందుకు కనిపిస్తారు.. ఎక్కడ కనిపిస్తారు అనేది మాత్రం సస్పెన్స్. అది మాత్రం థియేటర్లలోనే చూడాలని చెప్పాడు అనిల్.
సరిలేరు నీకెవ్వరులో మహేష్ బాబు
అసలు ఏ సందర్భంలో సూపర్ స్టార్ వస్తాడనేది కూడా చెప్పలేదు ఈ కుర్ర దర్శకుడు. చెప్పీ చెప్పకుండా చెప్పడంతో సినిమాలో కృష్ణ ఎక్కడ వస్తాడనేది తెలుసుకునే పనిలో పడ్డారు అభిమానులు. ఈ క్రమంలోనే వాళ్ల ప్రశ్నలకు సమాధానం కూడా దొరికేసింది. అనిల్ రావిపూడి చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ చిత్రంలో సన్నివేశంలో కాకుండా పాటలో వస్తాడని తెలుస్తుంది. మాస్ సాంగ్ అయిన మైండ్ బ్లాక్‌లో మహేష్ బాబుతో కలిసి లుంగీ స్టెప్స్ వేయబోతున్నాడు సూపర్ స్టార్ కృష్ణ.
‘సరిలేరు నీకెవ్వరు’ సెట్లో మహేష్,విజయశాంతి, ప్రకాష్ రాజ్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి (Twitter/Photo)
అంటే ఇప్పటి కృష్ణ కాదు.. మగధీరలో చిరంజీవిలా, యమదొంగలో ఎన్టీఆర్ మాదిరే ఒకప్పటి కృష్ణను ఇప్పుడు గ్రాఫిక్స్‌లో చూపించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో ఘట్టమనేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తండ్రీ కొడుకులను పక్కపక్కనే పెట్టి చూపించబోతున్నాడు అనిల్ రావిపూడి. అప్పట్లో సూపర్ స్టార్ వేసిన స్టెప్స్ ఎడిట్ చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు అనిల్. ఏదేమైనా కూడా ఆ అద్భుతమైన సీన్ చూడాలంటే జనవరి 11 వరకు వేచి చూడాల్సిందే. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో తాను కూడా భాగస్వామిగా మారిపోయాడు మహేష్ బాబు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.