Home /News /movies /

Vijay Devarakonda Liger: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. రౌడీ వచ్చేస్తున్నాడు..!

Vijay Devarakonda Liger: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. రౌడీ వచ్చేస్తున్నాడు..!

విజయ్ దేవరొకండ లైగర్ (Vijay Devarakonda Liger)

విజయ్ దేవరొకండ లైగర్ (Vijay Devarakonda Liger)

Vijay Devarakonda Liger: ఫ్లాపులు వచ్చినా కూడా తన మార్కెట్ పడిపోకుండా కాపాడుకున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). ప్రస్తుతం ఈయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన సర్ ప్రైజ్ ఒకటి అభిమానులకు ఇచ్చేలా కనిపిస్తున్నారు.

ఇంకా చదవండి ...
తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. వరస విజయాలతో ఈయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. మధ్యలో కొన్ని ఫ్లాపులు వచ్చినా కూడా విజయ్ తన మార్కెట్ పడిపోకుండా కాపాడుకున్నారు. ఈయన గత రెండు సినిమాలు వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్ పరాజయం పాలయ్యాయి. అయినా కూడా విజయ్ దేవరకొండ సినిమా కోసం పిచ్చెక్కిపోయి వేచి చూస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ స్థాయిలో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్నారు. ఈమెకు తొలి తెలుగు సినిమా ఇదే. ఒకేసారి అన్ని భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు పూరీ జగన్నాథ్. ఈయనకు హిందీలోనూ గుర్తింపు ఉంది.

అక్కడ అమితాబ్ బచ్చన్‌తో బుడ్డా హోగా తేరా బాప్ సినిమాను తెరకెక్కించారు పూరీ. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దానికి తోడు విజయ్ దేవరకొండకు కూడా హిందీలో మంచి ఇమేజ్ ఉంది. అక్కడ అర్జున్ రెడ్డి సినిమాతోనే విజయ్ పేరు మార్మోగిపోయింది. దాంతో లైగర్ సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నారు.
vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda instagram,vijay devarakonda liger movie,vijay devarakonda private jet,vijay devarakonda liger movie teaser,vijay devarakonda private jet photos,vijay devarakonda takes private jet,telugu cinema,విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ ప్రైవేట్ జెట్,విజయ్ దేరవకొండ బర్త్ డే రోజు మే 9న లైగర్ సినిమా టీజర్

అక్కడ కరణ్ జోహార్ ఈ సినిమాను విడుదల చేయబోతుండటం విశేషం. ఇదిలా ఉంటే మే 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సినిమా టీజర్ విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. దాంతో రౌడీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఫస్ట్ లుక్ మినహా ఇంకేం విడుదల చేయలేదు. దాంతో ఫ్యాన్స్ కోరిక మన్నిస్తూ మే 9న లైగర్ టీజర్ విడుదల చేయాలని చూస్తున్నారు పూరీ జగన్నాథ్.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Telugu Cinema, Tollywood, Vijay Devarakonda, Vijay devarakonda liger

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు