• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • SUPER STAR VS POWER STAR PAWAN KALYAN WILL ACT MAHESH BABU REJECTED PURI JAGANNADH JANAGANAMANA HERE ARE THE DETAILS TA

Mahesh Babu - Pawan Kalyan: మహేష్ బాబు సినిమాలో పవన్ కళ్యాణ్.. సూపర్ స్టార్ వర్సెస్ పవర్ స్టార్..

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ (Mahesh Babu, Pawan Kalyan)

Mahesh Babu - Pawan Kalyan: మహేష్ బాబు సినిమాలో పవన్ కళ్యాణ్ నటించనున్నారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు.

  • Share this:
    Mahesh Babu - Pawan Kalyan: మహేష్ బాబు సినిమాలో పవన్ కళ్యాణ్ నటించనున్నారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. ఐతే..సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో అంటే గతంలో పండగాడు చేద్దామనుకున్న ఒక చిత్రంలో ఇపుడు పవన్ కళ్యాణ్ యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు టాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. దర్శకుడు పూరీ జగన్నాథ్ మహేష్ బాబుతో ముచ్చటగా మూడో సినిమాగా ‘జనగణమన’ సినిమాను తెరకెక్కిద్దామనుకున్నారు. అంతా సాఫీగా సాగితే  ఈ ప్రాజెక్ట్ ఎపుడో పట్టాలెక్కేది. కానీ దర్శకుడిగా పూరీ జగన్నాథ్..వరుసగా ఫ్లాప్ సినిమాలు చేయడంతో మహేష్ బాబు పూరీతో చేద్దామనుకున్న ‘జనగణమన’ సినిమాకు బ్రేకులు వేసారు. దీంతో ఈ స్టోరీ ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. తాజాగా పూరీ జగన్నాథ్.. రామ్‌తో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి రావడంతో అపుడెపుడో మహేష్ బాబుతో చేద్దామనుకున్న ‘జనగణమన’ సినిమా స్క్రిప్ట్‌ను మరోసారి బయటకు తీసారు.

    మరోసారి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ సినిమా స్టోరీ రెడీ చేసి మహేష్ బాబు నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఆ తర్వాత యశ్ సహా పలువురు హీరోలతో పూరీ జగన్నాథ్ ఈ కథ వినిపించినా.. ఎందుకో వర్కౌట్ కాలేదన్నట్టు సమాచారం. కానీ రీసెంట్‌గా పూరీ జగన్నాథ్.. పవన్ కళ్యాణ్‌ కలిసి ‘జనగణమన’ స్టోరీని వినిపించినట్టు సమాచారం. ఈ కథ విని పవన్ కళ్యాణ్ కూడా ఇంప్రెస్ అయినట్టు సమాచారం. ఇక  పవర్ స్టార్ కూడా ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో సామాజిక సందేశం ఉన్న చిత్రాలను చేయడానికే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలోనే పూరీతో ‘జనగణమన’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

    pawan kalyan,puri jagannadh,pawan kalyan puri jagannadh movie,pawan kalyan new movie,pawan kalyan and puri jagannadh,puri jagannadh about pawan kalyan,pawan kalyan and puri jagannadh to team up again ?,pawan kalyan puri jagannadh movie first look,pavan kalyan new movie with puri jagannadh,పవన్ కళ్యాణ్,పూరీ జగన్నాథ్,పవన్ కళ్యాణ్ పూరీ జగన్నాథ్
    పవన్ కళ్యాణ్ పూరీ జగన్నాథ్ (pawan kalyan puri jagannadh)


    రీసెంట్‌గా పవన్ కళ్యాణ్.. ‘వకీలసాబ్’ మూవీతో పలకరించారు. ఆ తర్వాత ‘హరిహర వీరమల్లు’తో పాటు అయ్యప్పునుమ్ కోషియమ్’ సినిమాతో పాటు హరీష్ శంకర్ సినిమాలు చేయనున్నారు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ సినిమా పట్టాలెక్కే చాన్సెస్ ఉన్నట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఇక పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: