తెలుగు ప్రేక్షకులకు రజినీకాంత్ కొత్త యేడాది కానుక

ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్..కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘పేట’ సినిమా చేసాడు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ‘పేట’ మూవీని ఒకేసారి తమిళంతో పాటు తెలుగులో జనవరి 10న విడుదల చేయనున్నట్టు ఆల్రెడీ ప్రకటించాడు. తాజాగా కొత్త యేడాది కానుకగా తెలుగు ప్రేక్షకులకు సర్ఫ్రైజ్ గిఫ్ట్ అందిచారు తలైవా.

news18-telugu
Updated: December 31, 2018, 12:27 PM IST
తెలుగు ప్రేక్షకులకు రజినీకాంత్ కొత్త యేడాది కానుక
రజినీకాంత్ ‘పేట’(ట్విట్టర్ ఫోటో)
  • Share this:
ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్..కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘పేట’ సినిమా చేసాడు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ‘పేట’ మూవీని ఒకేసారి తమిళంతో పాటు తెలుగులో జనవరి 10న విడుదల చేయనున్నట్టు ఆల్రెడీ ప్రకటించాడు.

ఇప్పటికే రిలీజైన ‘పేట’ తమిళ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.  చూడబోతున్నారుగా కాళి ఆట. ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరినీ మీ పేటలో కలుస్తాను. అప్పటి వరకు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీలో రజినీకాంత్ లుక్స్ చాలా స్టైలిస్‌గా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. ‘బాషా’ మూవీ  తర్వాత రజినీకాంత్ నటించిన ‘పేట’ సంక్రాంతికి విడుదలవుతోంది.ఈ మూవీలో రజినీకాంత్ సరసన త్రిష, సిమ్రాన్ హీరోయిన్స్‌గా నటించారు. మరోవైపు విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దీకి, బాబీ సింహా ముఖ్యపాత్రల్లో నటించారు. అనిరుథ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని జనవరి 10న సంక్రాంతి కానుకగా తమిళం, తెలుగులో ఒకేసారి రిలీజ్ చేస్తన్నారు. మరి ‘పేటా’ మూవీతో రజినీకాంత్ మరోసారి తెలుగులో కూడా బాక్సాఫీస్ బాషా అనిపించుకుంటాడా లేదా అనేది వెయిట్ అండ్ సీ.
ఇది కూడా చదవండి 

#FlashBack2018: ఈ ఏడాది టాప్ హీరోయిన్లు వీళ్లే..#FlashBack2018: బాక్సాఫీస్‌‌ డుమ్మా కొట్టిన హీరోలు

#FlashBack2018: 2018 స‌ర్‌ప్రైజింగ్ స్టార్స్ ఎవ‌రో తెలుసా..?
First published: December 31, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు