Rajinikanth: ప్రధాని మోదీకి సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే విషెస్..

Rajinikanth Narendra Modi: నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా దేశవిదేశాల నుంచి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ వస్తుంది. సెప్టెంబర్ 17న ఈయన 70వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 17, 2020, 5:17 PM IST
Rajinikanth: ప్రధాని మోదీకి సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే విషెస్..
ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi)
  • Share this:
నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా దేశవిదేశాల నుంచి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ వస్తుంది. సెప్టెంబర్ 17న ఈయన 70వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఆయనకు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. తన ట్విట్టర్‌లో మోదీకి విషెస్ అందచేసాడు రజినీకాంత్. కష్టాల్లో మరింత బలంగా నిలబడి.. అందరికీ అండగా నిలిచిన మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు మోదీ గారూ అంటూ ట్వీట్ చేసాడు రజినీకాంత్. తలైవా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ముందు నుంచి కూడా రజినీ, మోదీకి మంచి స్నేహం ఉంది. ఈయన కారణంగానే రజినీ బిజేపీలోకి వస్తాడనే వార్తలు కూడా చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అప్పట్లో తమిళనాడుకు మోదీ వచ్చినపుడు కూడా ప్రత్యేకంగా రజినీకాంత్‌ను ఇంటికి వెళ్లి మరీ కలిసారు. ఆ తర్వాత బిజేపీకి సపోర్ట్ చేయాలంటూ రజినీకాంత్‌ను మోదీ కోరారు కూడా. దీనికి ఆయన నుంచి సమాధానం నో అనే వచ్చింది అది వేరే విషయం. కానీ మోదీ అంటే రజినీకాంత్ కూడా యిష్టపడుతుంటాడు. ఆయనంటే అభిమానిస్తుంటాడు. మోదీ చేస్తున్న పనులు అద్భుతంగా ఉన్నాయంటూ ఇప్పటిక పలు సందర్భాల్లో చెప్పాడు కూడా. సూపర్ స్టార్ అంటే మోదీకి కూడా ప్రత్యేకమైన గౌరవం ఉంది.
Published by: Praveen Kumar Vadla
First published: September 17, 2020, 5:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading