SUPER STAR RAJINIKANTH WILL GO TO USA FOR GENERAL BODY HEALTH CHECKUP PK
Rajinikanth health: అమెరికా వెళ్లనున్న రజినీకాంత్.. చికిత్స కోసం ప్రత్యేక అనుమతులు..
రజినీకాంత్ (Rajinikanth)
Rajinikanth health: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఈ మధ్య కాలంలో వరసగా అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా అప్పుడప్పుడూ సినిమా షూటింగ్స్‌లో ఉన్నపుడు కూడా ఈయన ఆరోగ్యం దెబ్బ తింటుంది. దాంతో రజినీ ఎప్పుడూ వైద్యుల సంరక్షణలోనే ఉన్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ మధ్య కాలంలో వరసగా అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా అప్పుడప్పుడూ సినిమా షూటింగ్స్‌లో ఉన్నపుడు కూడా ఈయన ఆరోగ్యం దెబ్బ తింటుంది. దాంతో రజినీ ఎప్పుడూ వైద్యుల సంరక్షణలోనే ఉన్నారు. మొన్నటి వరకు ఈయన శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమా చేస్తున్నారు. ఈ సెట్లోనూ వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన్ని పర్యవేక్షిస్తూనే ఉన్నారు. మరోవైపు రజినీకాంత్ కూడా తన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈయన అమెరికా వెళ్లడానికి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశం దాటడానికి ఎవరికీ అనుమతులు లేవు. అయితే తన ఆరోగ్యం దృష్ట్యా ప్రత్యేక అనుమతులు కోరుతూ కేంద్రాన్ని కోరారు రజినీకాంత్. స్పెషల్ ఫ్లైట్‌లో ఈయన అమెరికా వెళ్లనున్నారు. ఆయన కోరిన వెంటనే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. దాంతో కేవలం 14 మంది ప్రయాణించగలిగే ప్రత్యేక విమానంలో ఈయన యుఎస్ వెళ్లనున్నారు. రజినీకాంత్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే హీరో ధనుష్ తన కుటుంబంతో అమెరికా వెళ్లారు. అక్కడే ఓ హాలీవుడ్ సినిమా షూటింగ్ నిమిత్తం ఉన్నారు. ఇప్పుడు రజినీకాంత్ కూడా తన కుటుంబంతో అక్కడికి వెళుతున్నారు. వీళ్లంతా అమెరికాలో కలిసే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో జనరల్ బాడీ చెకప్ చేయించుకుంటారు రజినీకాంత్. గత కొన్నేళ్లుగా జనరల్ చెకప్ కోసం అమెరికా తరుచుగా వెళ్లి వస్తున్నారు సూపర్ స్టార్. ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నారు రజినీకాంత్.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.