Rajinikanth Praises 83 Movie | దాదాపు 38 ఏళ్ళ క్రితం కపిల్ దేవ్ సారథ్యంలో భారత దేశానికి క్రికెట్లో అందించిన మధురమైన విజయం 1983 వరల్డ్ కప్. దాన్ని ఇతివృత్తంగా తీసుకుని బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కించిన సినిమా ‘83’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 24న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. అనుకున్నట్టే విదేశాల్లో ఈ మూవీ మంచి వసూళ్లనే సాధించింది. కానీ మన దేశంలో మాత్రం అనుకున్నంత రేంజ్లో మాత్రం బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేయడం లేదు. మన దేశంలో ఓమిక్రాన్ భయం నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం థియేటర్స్‌లో సగం ఆక్యుపెన్షీ విధించడం ఈ సినిమా వసూళ్లపై ప్రభావం చూపించింది. ఇక ఈ సినిమాను చూసిన సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరు చూసి ‘83’ మూవీ అద్భుతం అంటూ కితాబు ఇస్తున్నారు.
తాజాగా తమిళ సూపర్ స్టార్ .. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రజినీకాంత్ .. 83 మూవీని చూసి ప్రశంసలు కురిపించారు. అప్పట్లో ఈ క్రికెట్ చూడని వాళ్లు.. ఈ సినిమా చూసి అప్పటి అనుభూతి పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా హీరోలైన రణ్వీర్ సింగ్, జీవాతో పాటు ఈ మూవీ నిర్మాత, దర్శకుడితో పాటు ఈ మూవీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అభినందలు తెలియజేసారు.
#83TheMovie wow 👏🏻👏🏻 what a movie… magnificent!!! Many congratulations to the producers @kabirkhankk @therealkapildev @RanveerOfficial @JiivaOfficial and all the cast and crew …
— Rajinikanth (@rajinikanth) December 28, 2021
‘83’ మూవీ విషయానికొస్తే.. భారత దేశంలో క్రికెట్ అనేది కేవలం ఆట కాదు.. ఎమోషన్.. ఇంకా చెప్పాలంటే ఓ మతం. 130 కోట్ల మందిలో దాదాపు 70 శాతం మంది క్రికెట్ చూస్తారంటూ సర్వేలు కూడా చెప్తున్నాయి. అంటే మన దేశంలో క్రికెట్ అనేది ఎంత పెద్ద క్రీడో అర్థమవుతుంది. అందుకే క్రికెట్ అన్నా.. ఆ నేపథ్యంలో వచ్చే సినిమాలన్నా ప్రేక్షకులు చాలా ఇష్టపడుతుంటారు. భారత దిగ్గజ క్రికెటర్స్‌లో ఒకరైన మాజీ సారథి కపిల్ దేవ్ (Kapil Dev) 83 వరల్డ్ కప్‌లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే కదా.
బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ ఈ సినిమాను డైరెక్టర్ చేశారు. ఇప్పటికే టీమిండియా మాజీ సారథులు ఎంఎస్ ధోని, సచిన్, అజారుద్దీన్ జీవిత చరిత్రలపై బయోపిక్స్ వచ్చాయి. అందులో ధోనీ బయోపిక్ సంచలన విజయం సాధించింది. ఇప్పుడు కపిల్ దేవ్ క్రికెటర్‌గా ఆయన పయనం... ప్రపంచ కప్ గెలవడంపై 83 సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా..
ఫస్డ్ డే .. రూ. 12.64 కోట్లు..
రెండో రోజు.. రూ. 16.95 కోట్లు..
మూడో రోజు.. రూ. 17.41 కోట్లు..
నాల్గో రోజు.. రూ. 7.29 కోట్లు వచ్చాయి.
మొత్తంగా నాలుగు రోజుల్లోఅన్ని భాషల్లో కలిపి రూ. 54.29 కోట్లు మాత్రమే వసూళు చేసింది. కరోనా ఓమిక్రాన్ వేరియంట్‌తో పాటు ఇతరత్రా కారణాల వల్ల అనుకున్నంత వసూళ్లను సాధించలేకపోయింది. మొత్తంగా టాక్ బాగున్నా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఫ్లాప్‌గా నిలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Ravi Teja - Khiladi : రవితేజ ‘ఖిలాడి’ మూవీ నుంచి మూడో పాట ప్రోమోకు ముహూర్తం ఖరారు..
టీమ్ ఇండియా (Team India) మొట్ట మొదటి సారి క్రికెట్ వరల్డ్ కప్ 1983లో (Cricket World Cup 1983) గెలిచింది. అప్పటికి క్రికెట్ అంటే కేవలం వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మాత్రమే. అందులో వన్డే వరల్డ్ కప్ నిర్వహించడం మొదలు పెట్టిన తర్వాత రెండు సార్లు వెస్టిండీస్ (West Indies) విజేతగా నిలిచింది. మూడో సారి కూడా విండీస్ జట్టే ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఆరవీర భయంకరమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉండే విండీస్‌ను అండర్ డాగ్స్‌గా మెగా టోర్నీలోకి అడుగుపెట్టిన భారత జట్టు ఓడించి ప్రపంచ కప్ గెలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 83 Biopic, Bollywood news, Kollywood, Rajinikanth, Ranveer Singh, Tollywood