అభిమానికి కాస్త గట్టిగానే ఇచ్చుకున్న రజినీకాంత్..

తమిళ  సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా తలైవా తన అభిమానికి కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చుకున్నాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 19, 2019, 6:45 PM IST
అభిమానికి కాస్త గట్టిగానే ఇచ్చుకున్న రజినీకాంత్..
రజినీకాంత్ (Rajinikanth)
  • Share this:
తమిళ  సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు ఒక్క తమిళనాడులోనే కాకుండా.. దేశ, విదేశాల్లో ఎంతో మంది వీరాభిమానులున్నారు. రీసెంట్‌గా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా చేసాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడతో కాస్తంత రిలాక్స్ కోసం హిమాలయ యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి శుక్రవారం అర్ధరాత్రి చైన్నైకు చేరుకున్నారు రజినీకాంత. ఈ క్రమంలో చెన్నై విమానాశ్రయంలో రజినీకాంత్‌కు స్వాగతం పలికేందుకు అభిమానులు పోటెత్తారు. అంతేకాదు ఆయనతో ఫోటోల కోసం ఎగబడ్డారు. అక్కడున్న వారందరికీ రజినీకాంత్ కూల్‌గా సమాధాన మిచ్చి తన ఇంటికి బయలు దేరారు.ఇక రజినీకాంత్ ఇంటికి బయలు దేరుతుండగా.. ఇంతలో ఓ అభిమాని తన బైక్ పై రజినీకాంత్ కారును ఫాలో అయ్యాడు.అలా సూపర్ స్టార్ ఇంటి వరకు వెళ్లాడు సదరు అభిమాని. ఆ తర్వాత రజినీకాంత్.. తన వాచ్‌మెన్ ద్వారా ఆ అభిమానిని ఇంట్లో పిలిపించాడు. ఇలాంటి సమయంలో బైక్ పై ప్రయాణం అంత మంచిది కాదంటూ సదరు అభిమానిని మందలించాడు.


ఇంకెపుడు ఇలా చెయోద్దంటూ వార్నింగ్ ఇచ్చి ఒక ఓ ఫోటో దిగి పంపించివేసాడు. నిన్న తమిళనాడు #WelcomeBackThalaiva’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్ అయింది. దీంతో సదరు ఫ్యాన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నాడు.
First published: October 19, 2019, 6:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading