‘మాఫియా’ను మెచ్చుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్..

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘మాఫియా’ను ప్రశంసలతో ముచ్చెంతాడు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: September 15, 2019, 6:43 PM IST
‘మాఫియా’ను మెచ్చుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్..
రజినీకాంత్ (Twitter/Photo)
  • Share this:
సూపర్ స్టార్ రజినీకాంత్ ‘మాఫియా’ను ప్రశంసలతో ముచ్చెంతాడు. వివరాల్లోకి వెళితే..  తమిళంలో ‘ద్రువంగల్ పదినారు’ సినిమాను డైరెక్ట్ చేసిన కార్తీక్ నరేన్.. అరుణ్ విజయ్ కథానాయకుడిగా ‘మాఫియా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అరుణ్ విజయ్ సరసన ప్రియా భవాని హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రసన్న విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ నరేన్..సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కలిసి చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రజినీ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించాడు. ఆ టీజర్ చూసి చాలా బాగుందంటూ కార్తీక్ నరేన్‌తో పాటు చిత్ర యూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తారు రజినీకాంత్. ఈ విషయాన్ని కార్తీక్ నరేన్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు.
ప్రస్తుతం తలైవా..ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 15, 2019, 6:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading