SUPER STAR RAJINIKANTH PEDDHANNA WORLD TELEVISION PREMIER ON SANKRANTHI TA
Rajinikanth : రజినీకాంత్ అభిమానులకు మరో శుభవార్త.. ‘పెద్దన్న’ టెలివిజన్ ప్రీమియర్‌కు ముహూర్తం ఖరారు..
రజినీకాంత్ (Twitter/Photo)
Super Star Rajinikanth : రజినీకాంత్ అభిమానులకు మరో శుభవార్త.. ‘పెద్దన్న’ టెలివిజన్ ప్రీమియర్‌కు ముహూర్తం ఖరారైనట్టు సమాచారం. తెలుగులో ‘పెద్దన్న’గా విడుదలైన ఈ మూవీ తమిళంలో ‘అన్నాత్తే’గా విడుదలైంది.
Rajinikanth : రజినీకాంత్ అభిమానులకు మరో శుభవార్త.. ‘పెద్దన్న’ టెలివిజన్ ప్రీమియర్‌కు ముహూర్తం ఖరారైనట్టు సమాచారం. గత కొన్నేళ్లుగా తెలుగులో రజినీకాంత్ సినిమాలు పెద్దగా ప్రభావం చూపడం లేదు. ‘రోబో’ తర్వాత తెలుగులో తలైవా ఏ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించలేదు. తెలుగులో ‘పెద్దన్న’గా విడుదలైన ఈ మూవీ తమిళంలో ‘అన్నాత్తే’గా విడుదలైంది. తమిళనాడులో రజినీకాంత్ క్రేజ్‌తో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. అంతేకాదు అక్కడ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమాకు అనుకున్నంత ఫలితం రాలేదు. ఇక తెలుగులో రజినీకాంత్ నటించిన ‘కబాలి’ ఫస్ట్ డే రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత రాను రాను తెలుగులో రజినీకాంత్ సినిమాలకు తెలుగులో క్రేజ్ తగ్గతూ వచ్చింది.
ఆ ఎఫెక్ట్ ‘పెద్దన్న’పై పడింది. ఈ సినిమాకు ఫస్ట్ డే తెలుగులో సరైన ఓపెనింగ్స్ దక్కించుకోలేక చతికిలపడిపోయింది. తెలుగులో ఈ సినిమాను రూ. 12 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. కానీ ఫైనల్‌గా రూ. 4.54 కోట్లతో సరిపెట్టుకుని డబుల్ డిజాస్టర్‌గా నిలిచింది. మొత్తంగా తెలుగులో రజినీకాంత్ కెరీర్లో ఇంత కంటే ఘోరమైన సినిమా నిలిచిపోయింది. తాజాగా రజినీకాంత్‌తో సినిమా అనగానే దర్శకుడు శివ సేఫ్ గేమ్ ఆడాడు. తమిళంలో హిట్ అనిపించుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది.
ఐతే.. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 50 కోట్లకు అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ సంక్రాంతి కానుకగా జనవరి 15న టెలికాస్ట్ కానున్నట్టు సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో జెమిని టీవీలో ప్రసారం కానుంది. మొత్తంగా సంక్రాంతికి రజినీకాంత్ సినిమా థియేటర్స్, ఓటీటీలో చూడని ప్రేక్షకులు.. ఇపుడు సంక్రాంతి కానుకగా టీవీల్లో చూడొచ్చు.
తెలుగు వెర్షన్ ‘పెద్దన్న’ సక్సెస్ కాకపోవడానికి పెద్ద రీజనే ఉంది. తెలుగులో ఈ సినిమాకు చివరి వరకు సరైన టైటిల్ ప్రకటించలేదు. అనారోగ్యం కారణంగా రజినీకాంత్ తెలుగులో అనుకున్నంత రేంజ్లో ప్రమోషన్ చేయలేకపోయారు. ఇవన్నీ తెలుగులో ‘పెద్దన్న’ డిజాస్టర్ జాబితాలో చేర్చిందనే చెప్పాలి.తమిళంలో హిట్ అనిపించుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది.
ఈ సినిమా రిలీజ్ హడావుడిలో ఉండగానే.. రజనీకాంత్ ..కేంద్ర ప్రభుత్వం నుంచి సినీ రాంగంలోని ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఇక ఢిల్లీ నుంచి చెన్నై వచ్చిన తర్వాత అస్వస్థతకు గురై చెన్నైలోని కావేరి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. చికిత్స తర్వాత ఈయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడంతో రజినీకాంత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.