Rajinikanth - Peddhanna Teaser Talk : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
Rajinikanth - Peddhanna Teaser Talk : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. దసరా పండగ సందర్భంగా తెలుగులో ఈ సినిమాకు ‘పెద్దన్న’ టైటిల్ ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘పెద్దన్న’ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా హక్కులను ఏషియన్ సినిమాస్.. రూ. 12 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. గతంలో రజినీకాంత్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార, మీనా, కుష్బూ కథానాయికలుగా నటించారు.
రజినీకాంత్ ‘అన్నాత్తే’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో పిక్చరైజ్ చేశారు. దాంతో పాటు కోల్‌కత్తాలో కూడా కొన్ని సన్నివేశాలను పిక్చరైజ్ చేసారు. ఇక ’పెద్దన్న’గా రాయల్ ఎన్ఫీల్డ్ పై వస్తోన్న రజినీకాంత్ లుక్ మాసీగా ఉంది. ఇప్పటికే తెలుగులో మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన ఈ చిత్ర యూనిట్ .. తాజాగా వెంకటేష్ ‘పెద్దన్న’ మూవీ టీజర్‌ను విడుదల చేశారు.
The teaser of #Peddhanna looks fantastic ! 👌👌 Best wishes to Superstar @rajinikanth garu !
మొత్తంగా మరోసారి మనో రజినీకాంత్‌కు చెప్పిన బ్యాక్ గ్రౌండ్ వాయిస్ అదిరిపోయింది. ‘పెద్దన్న’ సినిమా విషయానికొస్తే.. చాలా రోజుల తర్వాత రజినీకాంత్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆరోగ్యం సహకరించక పోయినా.. ఎన్నో తంటాలు పడి చివరికి ఈ సినిమాను పూర్తి చేసారు.
పక్కా మాస్ ఎంటర్టైనర్ చేసాడు సూపర్ స్టార్. చాలా రోజుల తర్వాత ఈయన్ని ఇంత మాస్‌గా చూపించారు దర్శకుడు శివ. ముఖ్యంగా రజినీకాంత్ నడిచొస్తుంటే పక్కన దీవాళికి టపాకాయలు పేల్చినట్లు.. బాంబులతో వ్యాన్స్ పేల్చడం హైలైట్ అనిపించింది. దాంతో పాటు సినిమా అంతా పక్కా విలేజ్ మాస్ డ్రామా అనేది అర్థమవుతుంది. గతంలో అజిత్‌తో వీరమ్, విశ్వాసం లాంటి సినిమాల్లో కూడా ఎక్కువగా విలేజ్ కథలనే చూపించాడు శివ. ఇప్పుడు కూడా ఇదే చేసారు. పెద్దన్నగా రజినీకాంత్ ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.
మరోవైపు ఇందులో రజినీ ఇంట్రో సాంగ్ దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. రజినీ నటించిన ఎన్నో సినిమాలకు ఇంట్రడక్షన్ సాంగ్స్ ఎస్పీ బాలు పాడారు. గతేడాది సమ్మర్లోనే సంగీత దర్శకుడు ఇమాన్ అన్నాత్తే పాటల రికార్డింగ్ పూర్తి చేసాడు. తెలుగు వెర్షన్ ‘పెద్దన్న’ సాంగ్‌ను కూడా ఎస్పీ బాలు గారు ఆలపించారు. త్వరలో తెలుగు పాటను విడుదల చేయనున్నారు. అన్నాత్తే టైటిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కూడా బాగానే ఉండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. తెలుగులో కూడా ఈ పాటకు అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.