Home /News /movies /

SUPER STAR RAJINIKANTH PEDDHANNA MOVIE WORLD TELEVISION PREMIER VERY LOW TA

Rajinikanth : సూపర్ స్టార్‌ రజినీకాంత్‌కు అక్కడ తప్పని అవమానం.. పెద్దన్న కష్టాలు మాములుగా లేవుగా..

రజినీకాంత్ (Twitter/Photo)

రజినీకాంత్ (Twitter/Photo)

Rajinikanth :  గత కొన్నేళ్లుగా రజినీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలను అందుకోవడం లేదు. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అతి తక్కువ రేటింగ్ దక్కించుకుంది.

    Rajinikanth :  గత కొన్నేళ్లుగా రజినీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలను అందుకోవడం లేదు. వెరైటీ స్టోరీలు కాకుండా రొటీన్ మాస్ సినిమాలతో పలకరిస్తోన్న రజినీకాంత్ సినిమాలపై ఒకప్పటిలా ఆకట్టుకోవడం లేదు. ‘రోబో’ తర్వాత తెలుగులో తలైవా ఏ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించలేదు. తెలుగులో ‘పెద్దన్న’గా విడుదలైన  ఈ మూవీ తమిళంలో ‘అన్నాత్తే’గా విడుదలైంది. తమిళనాడులో రజినీకాంత్‌ క్రేజ్‌తో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. అంతేకాదు అక్కడ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమాకు అనుకున్నంత ఫలితం రాలేదు. ఇక తెలుగులో రజినీకాంత్ నటించిన ‘కబాలి’ ఫస్ట్ డే రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత రాను రాను తెలుగులో రజినీకాంత్ సినిమాలకు తెలుగులో క్రేజ్ తగ్గతూ వచ్చింది.ఇక గతేడాది ఈయన ‘పెద్దన్న’ సినిమాతో పలకరించారు.

    ఆ ఎఫెక్ట్ ‘పెద్దన్న’పై పడింది. ఈ సినిమాకు ఫస్ట్ డే తెలుగులో సరైన ఓపెనింగ్స్ దక్కించుకోలేక చతికిలపడిపోయింది. తెలుగులో ఈ సినిమాను రూ. 12 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. కానీ ఫైనల్‌గా రూ. 4.54 కోట్లతో సరిపెట్టుకుని డబుల్ డిజాస్టర్‌గా నిలిచింది. మొత్తంగా తెలుగులో రజినీకాంత్ కెరీర్‌లో ఇంత కంటే ఘోరమైన సినిమా నిలిచిపోయింది. తాజాగా  రజినీకాంత్‌తో సినిమా అనగానే దర్శకుడు శివ సేఫ్ గేమ్ ఆడాడు. తమిళంలో హిట్ అనిపించుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది.

    Akhanda - Pushpa : ‘అఖండ’, ‘పుష్ప’ సహా 2021లో నిర్మాతలకు ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాలు ఇవే..


    ఐతే.. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ  చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 25 నుంచి  స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 50 కోట్లకు అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్  సంక్రాంతి కానుకగా జనవరి 15న జెమిని టీవీలో  టెలికాస్ట్ అయింది. మొత్తంగా సంక్రాంతికి రజినీకాంత్ సినిమా థియేటర్స్‌‌లో కన్నా ఓటీటీలో ఓ మోస్తరు విజయం అందుకుంది. కానీ ఈ సినిమా తొలిసారి టీవీలో ప్రసారమైనపుడు రేటింగ్ మాత్రం అనుకున్నంత రేంజ్‌లో రాలేదు. ఈ సినిమాకు 6.5  తక్కువ రేటింగ్ సాధించింది. రజినీకాంత్ రేంజ్‌కు ఇది తక్కువనే చెప్పాలి.

    Super Star Rajinikanth Peddhanna Final Closing Collections: Rajinikanth - Peddhanna Final Collections: ‘పెద్దన్న’ క్లోజింగ్ కలెక్షన్స్.. రజినీకాంత్‌కు ఘోర అవమానం..,Peddhanna collections, Annaatthe news, Peddhanna Twitter Review, Rajinikanth Annaatthe First Look released, Rajinikanth news, rajinikanth new movie, Annaatthe first look, rajinikanth news, rajinikanth films, rajinikanth siva, rajinikanth siva movie update, satya dev, రజనీకాంత్, సత్యదేవ్,రజినీకాంత్ పెద్దన్న ఫైనల్ కలెక్షన్స్,పెద్దన్న రజినీకాంత్,రజినీకాంత్ పెద్దన్న కలెక్షన్స్
    రజినీకాంత్ ‘పెద్దన్న’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ (Twitter/Photo)


    తెలుగు వెర్షన్ ‘పెద్దన్న’ సక్సెస్ కాకపోవడానికి పెద్ద రీజనే ఉంది. తెలుగులో  ఈ సినిమాకు చివరి వరకు సరైన టైటిల్ ప్రకటించలేదు. అనారోగ్యం కారణంగా రజినీకాంత్ తెలుగులో అనుకున్నంత రేంజ్‌లో ప్రమోషన్ చేయలేకపోయారు. ఇవన్నీ తెలుగులో ‘పెద్దన్న’ డిజాస్టర్ జాబితాలో చేర్చిందనే చెప్పాలి.తమిళంలో హిట్ అనిపించుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. తాజాగా టీవీలో కూడా ఈ సినిమా చతికిల బడింది. దీనికొ కారణం ఉంది. ఇప్పటికే  ఈ చిత్రాన్ని చాలా మంది ఓటీటీ వేదికగా వీక్షించారు. పైగా సంక్రాంతికి టీవీల్లో ఎవరు సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపెట్టరు.  దీంతో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు ఈ రేటింగ్ వచ్చిందనే టాక్ వినబడుతోంది.

    Chiranjeevi - Mohan Babu - Ravi Teja - Vijay Devarakonda : చిరంజీవి, మోహన్ బాబు, రవితేజ, విజయ్ దేవరకొండ ఈ హీరోల్లో ఉన్న కామన్ పాయింట్ తెలుసా..


    ఇక ’పెద్దన్న’ సినిమా రిలీజ్ హడావుడిలో ఉండగానే.. రజనీకాంత్ ..కేంద్ర ప్రభుత్వం నుంచి సినీ రాంగంలోని ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఇక ఢిల్లీ నుంచి చెన్నై వచ్చిన తర్వాత అస్వస్థతకు గురై చెన్నైలోని కావేరి హాస్పిటల్‌‌లో జాయిన్ అయ్యారు. చికిత్స తర్వాత ఈయన హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ కావడంతో రజినీకాంత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Peddhanna, Rajinikanth, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు