హోమ్ /వార్తలు /సినిమా /

Rajinikanth - Peddhanna Final Collections: ‘పెద్దన్న’ క్లోజింగ్ కలెక్షన్స్.. రజినీకాంత్‌కు ఘోర అవమానం..

Rajinikanth - Peddhanna Final Collections: ‘పెద్దన్న’ క్లోజింగ్ కలెక్షన్స్.. రజినీకాంత్‌కు ఘోర అవమానం..

రజినీకాంత్ ‘పెద్దన్న’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ (Twitter/Photo)

రజినీకాంత్ ‘పెద్దన్న’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ (Twitter/Photo)

Rajinikanth - Peddhanna Final Collections : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ అయ్యింది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది.

  Rajinikanth - Peddhanna Final Collections : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ అయ్యింది. దీపావళీ పండగ సందర్భంగా  ఈ సినిమా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. నయనతార, కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. దర్శకడు శివ ఇటు మాస్, అటు క్లాస్ రెండు వర్గాలను ఆకట్టుకునేలా సినిమాలను తెరకెక్కించడంతో ఆయన దిట్ట. అందులో భాగంగా వారిచేత విజిల్ వేయించగలడు. దర్శకుడు శివ గతంలో అజిత్ కుమార్‌తో ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు తీసి.. తమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక శివ రజనీకాంత్  (Rajinikanth)కాంబినేషన్’లో వస్తుండడంతో చిత్రంపై మంచి అంచనాలున్నాయి. అయితే అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది ఈ సినిమా. పెద్దన్న తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 1.8 కోట్ల రేంజ్ లో మొదటి రోజు కలెక్షన్స్ సాధిస్తుంది అనుకుంటే.. 1.6 కోట్ల షేర్ మార్క్‌ను అందుకుని నిరాశ పరిచింది.

  తాజాగా రజినీకాంత్ నటించిన ‘పెద్దన్న’ థియేట్రికల్ రన్ ముగిసింది. తాజాగా ఈ సినిమా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 12.5 కోట్ల బిజినెస్ చేయగా.. రూ. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.

  పెద్దన్నక్లోజింగ్ కలెక్షన్స్..

  Nizam: 1.56Cr

  Ceeded: 81L

  UA: 48L

  East: 37L

  West: 29L

  Guntur: 49L

  Krishna: 32L

  Nellore: 22L

  AP-TG Total:- 4.54CR(8CR~ Gross)

  మొత్తంగా రూ. 13 కోట్ల వసూళు చేయాల్సిన ఈ సినిమా రూ. 4.54 కోట్లతో సరిపెట్టుకుని డబుల్ డిజాస్టర్‌గా నిలిచింది. మొత్తంగా తెలుగులో రజినీకాంత్ కెరీర్‌లో ఇంత కంటే ఘోరమైన సినిమా నిలిచిపోయింది. ఈ సినిమాను దర్శకుడు శివ తన పాత సినిమాలైన ‘వేదాలం’, ‘విశ్వాసం’ సినిమాలతో పాటు గతంలో బి.గోపాల్, కోదండరామిరెడ్డి తెరకెక్కించిన పాత సినిమాలనే కాస్తా మార్చి తెరకెక్కిస్తాడనే పేరు ఉంది. ఇపుడు రజినీకాంత్‌తో సినిమా అనగానే సేఫ్ గేమ్ ఆడాడు. తమిళంలో హిట్ అనిపించుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది.

  Jr NTR - Kalyan Ram : చంద్రబాబు ఉదంతంలో వైసీపీ నేతలకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్ట్రాంగ్ కౌంటర్..

  ఇక అన్నాత్తే కంటే ముందు రజనీ దర్భార్ అంటూ వచ్చాడు. మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో ఈ సినిమా హక్కులను ఏషియన్ సినిమాస్.. రూ. 12 కోట్లకు కొనుగోలు చేసింది.  గతంలో రజినీకాంత్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

  NTR Jr - Mahesh Babu : ఎన్టీఆర్, మహేష్ బాబు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు టైమ్ ఫిక్స్.. అధికారిక ప్రకటన..

  ఈ సినిమా రిలీజ్ హడావుడిలో ఉండగానే.. రజనీకాంత్ ..కేంద్ర ప్రభుత్వం నుంచి సినీ రాంగంలోని ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఇక ఢిల్లీ నుంచి చెన్నై వచ్చిన తర్వాత అస్వస్థతకు గురై చెన్నైలోని కావేరి హాస్పిటల్‌‌లో జాయిన్ అయ్యారు. చికిత్స తర్వాత ఈయన హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ కావడంతో రజినీకాంత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Annaatthe Movie, Kollywood, Peddhanna, Rajinikanth, Tollywood

  ఉత్తమ కథలు