తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరుస్తున్నాడు. ఒకప్పుడు ఈయన సినిమాలు వస్తే బాక్సాఫీస్ మోత మోగిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రజినీకాంత్ సినిమా వచ్చినా కూడా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆయన ‘అన్నాత్తే’ విషయంలో ఇదే జరుగుతుంది. తెలుగులో ఈ సినిమాను ‘పెద్దన్న’గా డబ్ చేసారు. దీపావళీ పండగ సందర్భంగా ఈ సినిమా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. దర్శకడు శివ గత సినిమాలతో పోలిస్తే పెద్దన్న బాగా నిరాశ పరిచింది. ముఖ్యంగా ఆయన వీరమ్, వేదాళం, విశ్వాసం లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టించాయి. కానీ ఇప్పుడు మాత్రం పెద్దన్న విషయంలో అది అస్సలు కనిపించడం లేదు. ఆ మ్యాజిక్ మిస్ అయిందంటూ రజినీ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు.
ఇక శివ రజనీకాంత్ (Rajinikanth) కాంబినేషన్ అంటే ముందు నుంచి కూడా భారీ అంచనాలున్నాయి. కానీ వాటిని అందుకోవడంలో పెద్దన్న విఫలమైందని ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే అర్థమైపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 1.8 కోట్ల వసూళ్ళు సాధించింది పెద్దన్న. ఆ తర్వాత మూడు రోజుల్లో కూడా పెద్దగా వసూలు చేయలేదు. ఆదివారం కూడా ఈ సినిమాకు కేవలం 52 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఇలా వసూలు వస్తే.. బ్రేక్ ఈవెన్ కష్టం. తెలుగులో ఈ సినిమాను 12 కోట్లకు అమ్మారు.
‘పెద్దన్న’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..
నైజాం: 1.16 కోట్లు
సీడెడ్: 0.54 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.32 కోట్లు
ఈస్ట్: 0.22 కోట్లు
వెస్ట్: 0.18 కోట్లు
గుంటూరు: 0.36 కోట్లు
కృష్ణా: 0.21 కోట్లు
నెల్లూరు: 0.17 కోట్లు
ఏపీ + తెలంగాణ: 3.16 కోట్లు షేర్ (5.40 కోట్ల గ్రాస్)
అన్నాత్తే తమిళ 4 డేస్ కలెక్షన్స్: 42.20 కోట్లు షేర్ (76 కోట్ల గ్రాస్)
కర్ణాటక: 3.95 కోట్లు షేర్ (7.50 కోట్ల గ్రాస్)
కేరళ: 1.05 కోట్లు షేర్ (2.05 కోట్లు గ్రాస్)
రెస్టాఫ్ ఇండియా: 1.50 కోట్లు షేర్ (3 కోట్ల గ్రాస్)
ఓవర్సీస్: 12.5 కోట్లు షేర్ (25 కోట్లు గ్రాస్)
వరల్డ్ వైడ్ 4 డేస్ కలెక్షన్స్: 65 కోట్లు షేర్ (120 కోట్లు గ్రాస్)
ఈ సినిమా 12.5 కోట్ల బిజినెస్ చేయగా.. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగింది. ఇక పెద్దన్న 4 రోజుల్లో కేవలం 3.16 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇంకా 10 కోట్లు వసూలు చేస్తే కానీ క్లీన్ హిట్ అనిపించుకోదు. అన్నాత్తే కంటే ముందు రజినీకాంత్ దర్భార్ అంటూ వచ్చాడు. మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నిజానికి లింగా, కబాలి, కాలా, 2.0, దర్బార్, పేట లాంటి సినిమాలు నిరాశ పరిచాయి. ఇప్పుడు అన్నాత్తే కూడా ఇదే పరిస్థితి. సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajinikanth, Telugu Cinema, Tollywood