రజినీకాంత్ వాళ్లకు భయపడ్డాడా.. అందుకే సూపర్ స్టార్ వెనకడుగు..

రజినీకాంత్ ఫైల్ ఫోటో

సూపర్ స్టార్ రజినీకాంత్ నిజంగా వాళ్లకు భయపడ్డాడా.. అందుకే వెనకగుడు వేస్తున్నాడా అంటే ఔననే అంటున్న కోలీవుడ్ వర్గాలు.

 • Share this:
  సూపర్ స్టార్ రజినీకాంత్ నిజంగా వాళ్లకు భయపడ్డాడా.. అందుకే వెనకగుడు వేస్తున్నాడా అంటే ఔననే అంటున్న కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం రజినీకాంత్.. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా కంప్లీట్ చేసాడు. ఈ చిత్రంలో తైలవా సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. ముందుగా ఈ సినిమాను  జనవరి 15న విడుదల చేయాలనున్నారు. కానీ ఇపుడు ఈ సినిమాను ఒక వారం ముందుగానే జనవరి 9న ప్రేక్షకులు ముందు తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తోంది. ఎందుకంటే.. తమిళంలో జనవరి 15న విడుదల చేయడానికి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. కానీ తెలుగుతో పాటు హిందీ భాషల్లో ఆయా ప్రాంతీయ భాష చిత్రాలు సంక్రాంతికి విడుదల అవుతున్నాయి. తెలుగులో మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ విడుదల కానున్నాయి. హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన భారీ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ‘తానాజీ’ విడుదల అవుతోంది. వీటితో పోటీ పడితే.. ‘దర్బార్’ సినిమాకు థియేటర్ల సమస్య ఏర్పడుతుందని భావిస్తున్నారు. మరోవైపు తెలుగు డిస్ట్రిబ్యూటర్లు.. అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాల మధ్య రజినీకాంత్ సినిమాను విడుదల చేయలేమని చేతులేత్తాసారు. అందుకే ఈ సినిమాను ఒక వారం ముందుగానే రిలీజ్ చేయడానికి ‘దర్బార్’ చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

  super star rajinikanth movie darbar pre poned due to these reasons,rajinikanth,rajinikanth darbar,rjinikanth darbar movie pre poned,ar murugadoss,darbar murugadoss,rajinikanth allu arjun mahesh babu,mahesh babu,allu arjun,mahesh babu allu arjun,mahesh babu vs allu arjun,mahesh babu sarileru neekevvaru,allu arjun ala vaikunthapurramloo,sankranti 2020,sankranti movies,Mahesh Babu Sarileru Neekevvaru,Mahesh Babu Sarileru Neekevvaru movie,Sarileru Neekevvaru twitter,kalyan ram entha manchivadavura,Entha Manchivadavura Movie release date,Mahesh Babu twitter,Sarileru Neekevvaru movie updates,Mahesh Babu Sarileru Neekevvaru sankranti 2020,allu arjun trivikram,allu arjun trivikram movie title,allu arjun trivikram title,allu arjun trivikram title Ala Vaikuntapuram Lo,allu arjun mahesh babu,allu arjun mahesh babu clash,allu arjun mahesh babu movies sankranti 2020,allu arjun mahesh babu movies,allu arjun mahesh babu box office,telugu cinema,అల్లు అర్జున్,మహేష్ బాబు,అల్లు అర్జున్ మహేష్ బాబు,అల్లు అర్జున్ సంక్రాంతి 2020,అల్లు అర్జున్ త్రివిక్రమ్ అలా వైకుంఠపురంలో,కళ్యాణ్ రామ్ మహేష్ బాబు అల్లు అర్జున్,అల్లు అర్జున్ మహేష్ బాబు సంక్రాంతి 2020,మమహేష్ బాబు వర్సెస్ అల్లు అర్జున్,ఒకే రోజు వస్తున్న అల్లు అర్జున్ మహేష్,రజినీకాంత్,రజినీకాంత్ దర్బార్,దర్బార్,దర్బార్ ముందుగా విడుదల,
  దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో (Twitter/Photo)


  ఒకప్పటిలా రజినీకాంత్‌కున్న ఇమేజ్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు రజినీ సినిమా వస్తుంటే.. ఆ దరిదాపుల్లో ఎవరు తమ సినిమాను రిలీజ్ చేసే సాహసం చేసేవారు కాదు. కానీ రానురాను రజినీకాంత్ మార్కెట్ తెలుగుతో పాటు హిందీలో దారుణంగా పడిపోయింది. గతేడాది సంక్రాంతి పోటీలో తెలుగులో విడుదలైన ‘పేటా’ సినిమా సోది లేకుండా పోయింది. ఈ చిత్రం తెలుగులో కనీస స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేకపోయిందంటే... హీరోగా రజినీకాంత్ ఇమేజ్ ఎంతలా డ్యామేజ్ అయిందో అర్ధమవుతోంది. హిందీ సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక తమిళంలో కూడా రజినీకాంత్‌ ఇమేజ్ మునపటిలా లేదు. ఆయన మార్కెట్‌ రేంజ్‌ను అజిత్, విజయ్ ఎపుడో క్రాస్ చేసేసారు. తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్ మధ్య బాక్సాఫీస్ పోరులో రజినీకాంత్ ‘దర్బార్’ తట్టుకొని నిలబడటం కష్టమే. అందుకే రజినీకాంత్ పంతాలకు పోకుండా తన ‘దర్బార్’ సినిమాను ఒక వారం ముందుగానే థియేటర్స్‌కు తీసుకువచ్చే పనిలో పడ్డాడు. ఇక  ఈ సినిమాను ఆడియో ఫంక్షన్‌ను డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టినరోజున చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: