కమల్‌హాసన్‌ని కలిసిన రజినీకాంత్...కూతురి పెళ్లికి ఆహ్వానం

సౌందర్య, ప్ర‌ముఖ బిజినెస్ మ్యాన్ విషాగణ్ వనంగముడి వివాహాం ఫిబ్రవరి 11న చెన్నైలోని ఓ హోటల్‌లో జరగనుంది. ఈ వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానునున్నట్లు సమాచారం.

news18-telugu
Updated: February 8, 2019, 7:15 AM IST
కమల్‌హాసన్‌ని కలిసిన రజినీకాంత్...కూతురి పెళ్లికి ఆహ్వానం
కమల్‌ని కలిసిన రజినీకాంత్(twitter/BARaju)
  • Share this:
తమిళ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా రజినీకాంత్ కూతురు సౌందర్య పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. మరో నాలుగు రోజుల్లోనే వివాహం ఉండడంతో సూపర్ స్టార్ ఇంట పెళ్లిసందడి నెలకొంది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు రజినీ. స్వయంగా ఆయనే వెళ్లి అతిథులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి కమల్‌హాసన్‌ని కలిశారు. తమ కూతురు పెళ్లికి ఆయన్ను రావాల్సిందిగా ఆహ్వానించారు.

సౌందర్య, ప్ర‌ముఖ బిజినెస్ మ్యాన్ విషాగణ్ వనంగముడి వివాహాం ఫిబ్రవరి 11న చెన్నైలోని ఓ హోటల్‌లో జరగనుంది. ఈ వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానునున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 9 నుండి మెహందీ, సంగీత్ వేడుకలను నిర్వహించనున్నట్టు సమాచారం. సౌందర్య ఇది రెండో వివాహన్న విషయం తెలిసిందే.సౌంద‌ర్యకు కాబోయే రెండో భ‌ర్త విషాగణ్ వనంగముడి చెన్నైలోని ప్ర‌ముఖ ఫార్మాసూటికల్ కంపెనీకి యజమాని.. తమిళనాడులోని పేరు మోసిన బిజినెస్ మ్యాగ్నేట్ వనంగముడి కుమారుడే ఈ విషాగ‌న్. ఈయ‌న "వంజగర్ ఉల్గమ్" సినిమాలో హీరోగా కూడా న‌టించాడు. అది స‌క్సెస్ కాలేదు. ఆ త‌ర్వాత చిన్న చిన్న పాత్ర‌లు చేస్తున్నాడు.

సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య అప్పట్లో బిజినెస్ మ్యాన్ అశ్విన్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . వీళ్ల పెళ్లి ద‌గ్గ‌రుండి చేసాడు ర‌జినీకాంత్. 2010 జూలైలో ఈ పెళ్లి జ‌రిగింది. అయితే పెళ్లైన కొన్ని రోజుల త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ బేధాలు రావ‌డంతో విడిగానే ఉన్నారు. 2017లో వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు.
First published: February 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...