• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SUPER STAR RAJINIKANTH MAN VS WILD SHOW SNEALK PEEK RELEASED AND HOST BEAR GRYLLS TOUCHES RAJINI FEET PK

రజినీకాంత్ కాళ్లు పట్టుకున్న మ్యాన్ Vs వైల్డ్ హోస్ట్..

రజినీకాంత్ కాళ్లు పట్టుకున్న మ్యాన్ Vs వైల్డ్ హోస్ట్..

సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్‌తో రజినీకాంత్ (Facebook/Photo)

Man Vs Wild Rajinikanth: ఆ మధ్య మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు రజినీ. ఇప్పుడు ఈ షోకు సంబంధించిన స్నీక్ పీక్ విడుదలైంది. ఇందులో సూపర్ స్టార్‌తో చాలా సాహసాలు చేయించాడు బేర్ గ్రిల్స్.

  • Share this:
ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే రజినీ.. ఈ మధ్యే టీవీ షో చేసాడు. బుల్లితెరపై త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సూపర్ స్టార్. దీనికోసం ఆ మధ్య మూడు రోజుల పాటు షూటింగ్ కూడా చేసాడు రజినీ. ఆ మధ్య మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు రజినీ. అక్కడే షూటింగ్ చేస్తుండగా ఆయన ప్రమాదానికి కూడా గురయ్యారు. ఈ షూటింగ్ కర్ణాటకలో బందిపుర టైగర్ రిజర్వ్‌లో జరిగింది. జనవరి 28 నుంచి మూడు రోజుల పాటు ప్లాన్ చేసినా.. తొలిరోజే రజినీ గాయపడటంతో కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని మళ్లీ షూటింగ్ పూర్తి చేసారు.

రజినీకాంత్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ (rajinikanth man vs wild)
రజినీకాంత్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ (rajinikanth man vs wild)


మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో భాగంగా ఆయన షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇప్పుడు ఈ షోకు సంబంధించిన స్నీక్ పీక్ విడుదలైంది. ఆ షో హోస్ట్ బేర్ గ్రిల్స్‌ తన ట్విట్టర్లో విడుదల చేసాడు. గాయం తీవ్రత మరీ ఎక్కువేం కాకపోవడంతో వెంటనే షూట్‌కు వచ్చాడు రజినీ. ఇక ఇందులో సూపర్ స్టార్‌తో చాలా సాహసాలు చేయించాడు బేర్ గ్రిల్స్. ముఖ్యంగా ఆయనతో కొండలెక్కించాడు.. గుట్టలెక్కించాడు.. వంతెనపై నడిపించాడు. ఇలా చాలానే చేయించాడు గ్రిల్స్. ఈ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి బేర్ గ్రిల్స్ ట్వీట్ చేసాడు. ప్రపంచంలో ఎంతోమంది సూపర్ స్టార్స్‌తో తాను పని చేసినా కూడా రజినీతో షూటింగ్ అనుభవం మాత్రం చాలా ప్రత్యేకం అంటూ రాసుకొచ్చాడు ఈయన.

మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్ స్పాట్‌లో రజినీకాంత్ (Facebook/Photo)
మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్ స్పాట్‌లో రజినీకాంత్ (Facebook/Photo)


త్వరలోనే ఎపిసోడ్ ప్లే కానుంది. ఇప్పుడు విడుదలైన స్నీక్ పీక్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దాంతో పాటు ప్రపంచంలో ఉన్న నీటి సమస్య గురించి కూడా ఇందులో చర్చించుకున్నారు రజినీ, గ్రిల్స్. దాంతో పాటు మీరు యుక్త వయసులో ఉన్నపుడు ఏం చేసేవాళ్లు అంటూ రజినీని అడిగితే బస్ కండక్టర్ అంటూ సమాధానమిచ్చాడు.

అక్కడితో ఆగకుండా తను కుటుంబ సభ్యులతో ఉన్నపుడు రజినీకాంత్ అనే విషయం మరిచిపోతానని.. శివాజీరావ్ గైక్వాడ్‌గా ఉంటానని చెప్పాడు. ఈ షో మధ్యలో రజినీ షూ లేస్ ఊడిపోతే ఆయన కాళ్లు పట్టుకుని కట్టాడు బేర్ గ్రిల్స్. ఇదిలా ఉంటే ప్రస్తుతం రజినీకాంత్.. శివ దర్శకత్వంలో అన్నాత్త సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా ఆపేసారు. కచ్చితంగా బుల్లితెరపై రజినీకాంత్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్ సంచలనం సృష్టిస్తుందని నమ్ముతున్నారు షో నిర్వాహకులు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు