news18-telugu
Updated: November 21, 2019, 9:06 AM IST
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆప్ ఇండియా (ఇఫీ) అవార్డు వేడుకలు గోవాలో ఎంతో ఆడంబరంగా ప్రారంభం అయ్యాయి. ఈ చిత్రోత్సవంలో రజినీకాంత్‌కు అమితాబ్ బచ్చన్ చేతులు మీదుగా ‘ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఇఫి’ అవార్డును ప్రదానం చేశారు.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆప్ ఇండియా (ఇఫీ) అవార్డు వేడుకలు గోవాలో ఎంతో ఆడంబరంగా ప్రారంభం అయ్యాయి. ఈ బుధవారం మొదలైన ఈ చిత్రోత్సవం ఈ నెల 28 వరకు జరగనున్నాయి. ఈ సారి ఇఫీ 50వ వేడుకలు జరుపుకోంటోంది. ఈ గెల్డెన్ జూబ్లీ వేడుకల్లో కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో ముఖ్యఅథితులుగా పాల్గొన్నారు. మరోవైపు ఈ వేడుకలో బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్,సూపర్ స్టార్ రజినీకాంత్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ చిత్రోత్సవంలో రజినీకాంత్‌కు అమితాబ్ బచ్చన్ చేతులు మీదుగా ‘ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఇఫి’ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. నాకొచ్చిన ఈ అవార్డును తనతో పనిచేసిన దర్శక, నిర్మాతలకు తోటి నటీనటులకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన రజినీకాంత్.. బస్ కండక్టర్ నుంచి దేశం గర్వపడే స్థాయి నటుడిగా ఎదగడం ఎందరికో స్పూర్తి దాయకం అన్నారు.

ఐఫా అవార్డు వేడుకల్లో కేంద్ర మంత్రి ప్రకాష్ జవేదకర్,అమితాబ్,రజినీకాంత్ (twitter/Photo)
ఆయనను నేను తమ కుటుంబ సభ్యుడిగానే భావిస్తాననన్నారు. అంతేకాదు వృత్తిలో ఒకరకొకరం సలహాలు కూడా ఇచ్చిపుచ్చుకుంటామని చెప్పారు. ఏమైనా ఒక వేదికపై ఇద్దరు లెజండరీ నటులను చూసి వేడుకకు వచ్చిన అభిమానులు పులకించిపోయారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 21, 2019, 9:06 AM IST