తమిళ సినీ ఇండస్ట్రీకి రెండు కళ్ల లాంటి వారైన సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ మరోసారి ఒక సినిమా కోసం కలిసి పనిచేయబోతున్నట్టు కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సంక్రాంతికి రజినీకాంత్ ‘దర్బార్’ సినిమాతో పలకరించాడు.ఈ సినిమా తమిళంలో మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమా తర్వాత రజినీకాంత్.. శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన ఒకప్పటి హీరోయిన్స్ ఖుష్బూ,మీనా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కీర్తి సురేష్ ముఖ్యపాత్రలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత రజినీకాంత్.. కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం.
70 ఏళ్ల వయసులో గ్యాప్ లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తున్న రజినీకాంత్.. ఆ తర్వాత రాజకీయాలపై ఫోకస్ పెట్టనున్నట్టు సమాచారం. ఇప్పటికే సినిమాల విషయంలో కలిసి పనిచేయబోతున్న కమల్ హాసన్, రజినీకాంత్.. రేపొద్దున రాజకీయంగా కలిసి పనిచేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Darbar, Kamal haasan, Kollywood, Lokesh Kanagaraj, Rajini Kanth, Tollywood