దటీజ్ రజినీకాంత్.. మరోసారి తన పెద్ద మనసు చాటుకున్న తలైవా..

తెరపైనే హీరోయిజం ప్రదర్శించే హీరోలు.. అపుడుపుడు రియల్ లైఫ్‌లోనను నిజమైన హీరోలుగా ప్రూవ్ చేసుకున్నవాళ్లు అతి కొద్ది మందే ఉంటారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు.

news18-telugu
Updated: September 4, 2019, 3:57 PM IST
దటీజ్ రజినీకాంత్.. మరోసారి తన పెద్ద మనసు చాటుకున్న తలైవా..
‘దర్బర్’లో రజనీకాంత్‌ (Twitter/Photo)
  • Share this:
తెరపైనే హీరోయిజం ప్రదర్శించే హీరోలు.. అపుడుపుడు రియల్ లైఫ్‌లోనను నిజమైన హీరోలుగా ప్రూవ్ చేసుకున్నవాళ్లు అతి కొద్ది మందే ఉంటారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. తాజాగా రజినీకాంత్.. నటుడిగా  స్ట్రగుల్ అవుతున్న సమయంలో ‘భైరవ’ సినిమాతో హీరోగా నిలదొక్కుకున్నారు. ఆ సినిమాను ప్రముఖ కథా రచయత కలైజ్ఞానం నిర్మించారు. అప్పట్లో ఆ సినిమా రజినీకాంత్ జీవితాన్నే మార్చేసింది. అలాంటి నిర్మాత ఇపుడు ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేదు.ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు భారతీరాజా నేతృత్వంలోని కలైజ్ఞానం సన్మాన కార్యక్రమంలో నటుడు శివకుమార్ తెలిపారు. అంతేకాదు ఈ సందర్భంగా నిర్మాత కలైజ్ఞానంకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇల్లు కట్టించాలని విజ్ఞప్తి చేసారు. అదే సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్.. ఆ అవకాశం నేను ప్రభుత్వానికి ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే.. కలైజ్ఞానానికి తానే ఇల్లు కట్టిస్తానని చెప్పడమే కాదు మాట కూడా ఇచ్చారు. అంతేకాదు 10 రోజుల్లో అందుకు కావాల్సిన రూ.1 కోటి డబ్బును అందిస్తానని రజినీకాంత్ చెప్పారు. ఇక కలైజ్ఞానం కోసం ఇల్లు వెతికే పనిలో పడ్డారు భారతీరాజా అండ్ టీమ్.

super star rajinikanth helps to donate house for one of his producer kalignanam,rajinikanth,kalaignanam,rajinikanth kalaignanam,rajinikanth helps producer kalaignanam,kalaignanam speech,rajinikanth speech,kalaignanam function,rajinikanth latest,rajinikanth politics,rajinikanth latest speech,ranjinikanth speech about kalaignanam,kalaignanam about rajini,script writer kalaignanam,kalaignanam script writer & producer,superstar rajinikanth,rajinikanth about kalaignanam,kalaignanam felcitation function,rajinikanth speech about kalaignanam,rajinikanth songs,rajinikanth movie,kollywood,tamil cinema,రజినీకాంత్,రజినీకాంత్ కలైజ్ఞానం,నిర్మాతకు ఇల్లు బహుమతిగా ఇచ్చిన రజినీకాంత్,రజినీకాంత్ దర్బార్,దర్బార్,నిర్మాతకు సాయం చేసిన రజినీకాంత్,
నిర్మాత కలైజ్ఞానంకు ఇల్లు బహుకరిస్తానన్న తలైవా (Twitter/Photo)


దీనిపై నిర్మాత కలైజ్ఞానం స్పందిస్తూ.. తనకు రజినీకాంత్‌తో ఎలాంటి అనుబంధం, రక్త సంబంధం లేదన్నారు. ఆయన్ని హీరోగా పరిచయం చేసిన చిత్రాన్ని నిర్మించానంతే అని పేర్కొన్నారు. అలాంటి రజినీకాంత్ తనకు సాయం చేయడంపై ఆయన మాట్లాడుతూ.. రజినీకాంత్ రియల్ లైఫ్‌లోనే నిజ జీవితంలోనూ హీరో అంటూ మెచ్చుకున్నారు. గతంలోను రజినీకాంత్..తనతో చిత్రాలు చేసి.. ఆ తర్వాత ఆర్ధికంగా వెనకబడ్డ నిర్మాతలను భాగస్వాములుగా చేసిన అరుణాచలం సినిమాను నిర్మించి.. లాభాల్లో వాళ్లకు వాటాలాను పంచారు. అప్పట్లో ప్రముఖ నిర్మాత కలైజ్ఞానం కూడా ఉన్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 4, 2019, 3:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading