కేంద్రంపై రజినీకాంత్ ఫైర్.. ఢిల్లీ అల్లర్లకు మీదే బాధ్యత..

Rajinikanth comments on Delhi Voilence: సూపర్ స్టార్ రజినీకాంత్ ఢిల్లీ అల్లర్లపై నోరు విప్పాడు. ఈ అల్లర్లకు కేంద్రప్రభుత్వాన్ని తప్పు పట్టాడు. వాళ్ల వైఖరిపై తమిళ సూపర్ స్టార్ మండి పడ్డాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 26, 2020, 10:31 PM IST
కేంద్రంపై రజినీకాంత్ ఫైర్.. ఢిల్లీ అల్లర్లకు మీదే బాధ్యత..
రజినీకాంత్ చేసిన పనికి అభిమానులు కూడా మురిసిపోతున్నారు. తమ హీరో అంటే ఇదిరా అంటూ కాలర్ ఎగిరేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వంలో అన్నాత్తై సినిమా చేస్తున్నాడు రజినీకాంత్. ఇది వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది.
  • Share this:
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఢిల్లీ అల్లర్ల గురించి చర్చ జరుగుతుంది. అక్కడ జరిగిన అల్లర్లలో 22 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు తెలిసి అంతా కలద చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఈ ఘటనపై మనసులో మాట చెబుతున్నారు. కొందరు సినిమా ప్రముఖులు కూడా ఈ విషయంపై మాట్లాడుతున్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈ అల్లర్లకు కేంద్రప్రభుత్వాన్ని తప్పు పట్టాడు. వాళ్ల వైఖరిపై తమిళ సూపర్ స్టార్ మండి పడ్డాడు. పౌరసత్వ సవరణ చట్టంతో ముస్లింలకు నష్టం కలిగితే.. గతంలో చెప్పినట్లుగానే తాను వాళ్ల వెంట నడుస్తానని మరోసారి స్పష్టం చేసాడు రజనీకాంత్. ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు ముమ్మాటికి కేంద్రప్రభుత్వం నిఘా వైఫల్యమే అని ఆయన విమర్శించాడు. ఈ విషయంలో కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని రజనీ తెలిపారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఈయన.. అప్పుడప్పుడూ ఇలా ప్రజాసమస్యలపై కూడా మాట్లాడుతున్నాడు. రజినీ మాటలను పలువురు రాజకీయ నేతలు కూడా సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం విషయం తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్నాడంటూ విమర్శిస్తున్నారు.

Published by: Praveen Kumar Vadla
First published: February 26, 2020, 8:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading