Darbar: దర్బార్‌లో రజినీకాంత్ ఊర మాస్ లుక్.. వైరల్ అవుతున్న ఫోటో..

ఈ యేడాది ‘పేటా’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన రజినీకాంత్.. తాజాగా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో రజినీకాంత్ మాస్ లుక్‌తో ఉన్న పోస్టర్‌ను విడుదల చేసారు.

news18-telugu
Updated: September 12, 2019, 8:30 AM IST
Darbar: దర్బార్‌లో రజినీకాంత్ ఊర మాస్ లుక్.. వైరల్ అవుతున్న ఫోటో..
‘దర్బార్’లో రజినీకాంత్ మాస్ లుక్
news18-telugu
Updated: September 12, 2019, 8:30 AM IST
ఈ యేడాది ‘పేటా’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన రజినీకాంత్.. తాజాగా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రజినీకాంత్  దాదాపు ఇరవై ఐదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘దర్బార్’లో రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో రజినీకాంత్‌ను ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటించబోెతున్నట్టు సమాచారం. ఇప్పటికే ముంబాయిలో ఈసినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్‌ను చిత్రీకరించారు. అంతేకాదు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌తో పాటు మరో రెండు స్టిల్స్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు పోలీస్ ఆఫీసర్‌తో పాటు క్లాస్‌ లుక్‌లో ఉన్న రజినీకాంత్ స్టిల్స్‌ను విడుదల చేసారు. తాజాగా ఈ సినిమాలో రజినీకాంత్ ఊర మాస్‌లో ఉన్న లుక్‌ను విడుదల చేసారు. ఈ లుక్‌లో రజినీకాంత్‌ను చూస్తూ సూపర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

‘దర్బార్’లో రజినీకాంత్ మాస్ లుక్


లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

First published: September 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...