• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SUPER STAR RAJINIKANTH BEAR GRYLLS MAN VS WILD ADVENTURE PROGRAMME TELECAST TODAY TA

ఈ రోజే రజినీకాంత్ అభిమానులకు నిజమైన పండగ.. తలైవా ఫ్యాన్స్ లుంగీ డాన్స్..

ఈ రోజే రజినీకాంత్ అభిమానులకు నిజమైన పండగ.. తలైవా ఫ్యాన్స్ లుంగీ డాన్స్..

రజనీకాంత్ Photo : Twitter

Rajinikanth Man Vs Wild | ఈ రోజు రజినీకాంత్ అభిమానులకు నిజమైన పండగ. లుంగీ డాన్స్ చేస్తోన్న తలైవా ఫ్యాన్స్ వివరాల్లోకి వెళితే..

  • Share this:
    ఈ రోజు రజినీకాంత్ అభిమానులకు నిజమైన పండగ. లుంగీ డాన్స్ చేస్తోన్న తలైవా ఫ్యాన్స్ వివరాల్లోకి వెళితే.. ఎప్పుడూ సినిమాలతో బిజీ బిజీగా ఉండే రజినీ కాంత్.. ఈ మధ్యే ప్రముఖ సాహసికుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు రజినీకాంత్. అక్కడ కర్ణాటకలోని బందీపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్ సందర్భంగా  రజినీకాంత్ గాయాలపాలైయిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రియల్ ప్రోగ్రామ్‌లో బేర్ గ్రిల్స్  రజినీకాంత్‌తో  కొండలెక్కించాడు.. గుట్టలెక్కించాడు.. వంతెనపై నడిపించాడు. ఇలా చాలానే చేయించాడు గ్రిల్స్. ప్రపంచంలో ఎంతోమంది సూపర్ స్టార్స్‌తో తాను పని చేసినా కూడా రజినీతో షూటింగ్ అనుభవం మాత్రం చాలా ప్రత్యేకం అంటూ రాసుకొచ్చాడు ఈయన.

    రజినీకాంత్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ (rajinikanth man vs wild)
    రజినీకాంత్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ (rajinikanth man vs wild)


    మన దేశం విషయానికొస్తే.. గతంలో బేర్ గ్రిల్స్ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారితో ఇలాంటి సాహసాలే చేయించాడు. ఇపుడు రజినీకాంత్ సాహాసాలు చేయించాడు. ఈయన మన దేశానికి చెందిన రెండో వ్యక్తి. తాజాగా బేర్ గ్రిల్స్.. మన దేశానికి చెందిన అక్షయ్ కుమార్‌తో మూడో అడ్వెంచర్ ప్రోగ్రామ్‌ చేస్తున్నాడు. రజినీకాంత్‌తో చేసిన ఈ ప్రోగ్రామ్‌ ఈ రోజు రాత్రి 8.00 గంటలకు డిస్కవరి ఛానెళ్లో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ప్రోగ్రామ్ ప్రసారం కానుంది.  ఈ ప్రోగ్రామ్ కోసం కోట్లాది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌తో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ భాషల్లో ప్రసారం కానుంది. మొత్తానికి బేర్ గ్రిల్స్‌తో తలైవా చేసిన సాహాసలు చూడాలంటే ఈ రోజు రాత్రి వరకు వేచి ఉండాల్సిందే.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు