హోమ్ /వార్తలు /సినిమా /

Darbar Trailer: ‘దర్బార్’ ట్రైలర్ టాక్.. సూపర్ కాప్‌గా రఫ్ఫాడించిన రజినీకాంత్..

Darbar Trailer: ‘దర్బార్’ ట్రైలర్ టాక్.. సూపర్ కాప్‌గా రఫ్ఫాడించిన రజినీకాంత్..

దర్బార్ సినిమా (Darbar movie Rajinikanth)

దర్బార్ సినిమా (Darbar movie Rajinikanth)

ఈ యేడాది ‘పేటా’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన రజినీకాంత్.. ఆ తర్వాత  ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా చేసాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసారు.

ఈ యేడాది ‘పేటా’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన రజినీకాంత్.. ఆ తర్వాత  ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా చేసాడు. ఇప్పటికే విడుదలైన ఈ  ‘దర్బార్’ మూవీ టీజర్‌కు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసారు.  ఈ సినిమా ట్రైలర్ ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ మూవీగా రజినీకాంత్ అభిమానులను దృప్టిలో పెట్టుకుని దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ ‘దర్బార్’ మూవీని  తెరకెక్కించినట్టు కనబడుతోంది.  ట్రైలర్ విషయానికొస్తే.. ఈ సినిమాను ముంబాయి నేపథ్యాన్ని ఎంచుకున్నాడు మురుగదాస్. ఈ చిత్రంలో రజినీకాంత్..ముంబాయి పోలీస్ కమిషనర్ ఆదిత్య అరుణాచలం అనే పాత్రలో రఫ్పాడించాడు. దాదాపు 28 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రజినీకాంత్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడంతో అభిమానులు ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.  ‘దర్బార్’లో తలైవాను ఢీ కొట్టే విలన్‌ పాత్రలో సునీల్ శెట్టి నటించాడు.

' isDesktop="true" id="402290" youtubeid="cUNNTO0IJSU" category="movies">

ఈ ట్రైలర్‌లో ముందుగా వాడు పోలీస్ ఆఫీసరా సర్ ?.. హంతకుడు.. అంటూ రజినీ మేనరిజాన్ని పరిచయం చేస్తూ ట్రైలర్‌ను కట్ చేసారు. ఆ చూపేంటి.. ఒరిజినల్‌గా విలనమ్మా అ.. ఐయామ్ ఏ బ్యాడ్ కాప్ అని రజినీకాంత్ పలకించే హావభావాలు అభిమానులను అలరించేలా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే.. రజినీకాంత్.. చాలా సేఫ్‌గా ఉండేలా మాస్ కథను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజినీ కాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని జనవరి 9న తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో  రిలీజ్ చేయనున్నారు. మరి ‘దర్బార్’ చిత్రంతో రజినీకాంత్ మరోసారి తన సత్తా చూపెడతాడా ? లేదా అనేది చూడాలి.

First published:

Tags: Bollywood, Darbar, Kollywood, Nayanthara, Rajinikanth, Sunil Shetty, Tollywood

ఉత్తమ కథలు