సూపర్‌స్టార్ రజినీకాంత్‌కి షాక్ తగిలింది. ఆయన రాజకీయ ఆలోచనలకు కోవిడ్ ఓ రకంగా దెబ్బ కొట్టిందనాలి. అసలేం జరిగింది. అనే వివరాల్లోకి వెళితే.. రజినీకాంత్, శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం అణ్ణాతే. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. రీసెంట్‌గానే రజినీకాంత్‌తో సెట్స్‌లో జాయిన్ అయ్యారు. డిసెంబర్ 31న పార్టీని అనౌన్స్ చేసి సంక్రాంతి నాటికంతా అణ్ణాతే షూటింగ్‌ను పూర్తి చేసి తర్వాత పార్టీని అధికారికంగా ప్రకటించాలని రజినీకాంత్ ప్లాన్ చేసుకున్నారు. అందుకు తగిన ప్రణాళికలతో హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో షూటింగ్‌ను స్టార్ట్‌చేశారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే రజినీ స్పీడు కోవిడ్ బ్రేకులేసింది. ఏకంగా యూనిట్‌లో 8 మందికి కరోనా సోకింది. దీంతో ఎంటైర్ యూనిట్ హైదరాబాద్ నుండి చెన్నై తిరిగొచ్చేశారు. మరి తదుపరి షెడ్యూల్‌ను రజినీకాంత్ ఎప్పుడు ప్లాన్ చేస్తారని దానిపై క్లారిటీ లేదు.
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజినీకాంత్ పార్టీని స్థాపించి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాడు. సంక్రాంతికి పార్టీని అనౌన్స్ చేస్తారని కూడా వార్తలు వినపడ్డాయి. అయితే ఈలోపు రజినీకాంత్ పూర్తి చేయాల్సిన సినిమా అణ్ణాతేను పూర్తి చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు. పక్కా ప్లానింగ్ ప్రకారం జనవరిలో లోపు ప్లాన్ చేయాలనేది రజినీ అనుకున్నాడు. రోజుకి 14 గంటలు లెక్కలో రజినీకాంత్ షూటింగ్‌లో పాల్గొన్నాడట. దీంతో అనుకున్నట్లుగానే షూటింగ్ పూర్తవుతుందని అందరరూ అనుకున్నారు. కానీ ఈలోపు యూనిట్ సభ్యులకు కరోనా వైరస్ సోకడం షాకింగ్ విషయమే.
ఈ ఏడాది సంక్రాంతికి దర్బార్ సినిమాతో బాకాపీస్ వద్ద సందడి చేసిన రజినీకాంత్ త్వరగానే అణ్ణాతేను పూర్తి చేయాలని అనుకన్నాడు. అందుకు తగినట్లుగానే సినిమాను త్వరగానే స్టార్ట్ చేశాడు కూడా. కానీ మధ్య కోవిడ్ ప్రభావంతో సినిమా షూటింగ్స్ ఆరేడు నెలలు ఆగిపోవడంతో రజినీకాంత్ ఏం చేయలేకపోయాడు. ఈలోపు ఆయనకు పొలిటికల్ ఎంట్రీ ఆలోచన వచ్చింది. అందుకని ఈ నెలలో షూటింగ్‌ను స్టార్ట్ చేశాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనుకున్నారు. కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు.. అన్నట్లుగా కోవిడ్ ప్రభావం యూనిట్‌ను తాకింది. ఇప్పటికే ఆలస్యమైన ఈ సినిమా కోసం రజినీకాంత్ మరెప్పుడు సమయం కేటాయిస్తాడనేది నిర్మాతల్లో టెన్షన్ మొదలైంది. రెండు, మూడు వారాల బ్రేక్ తీసుకుని సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడమంటే ఇప్పట్లో కుదిరే పని కాదు. మరి తలైవా ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood Cinema, Rajini Kanth, Rajnikanth