Home /News /movies /

SUPER STAR RAJINIKANTH ANNAATTHE ANOTHER CRAZY UPDATE HERE ARE THE DETAILS TA

Rajinikanth - Annaatthe : రజినీకాంత్ ‘అన్నాత్తే’ మూవీపై మరో క్రేజీ అప్‌డేట్..

రజినీకాంత్ ‘అన్నాత్తే’ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ (Twitter/Photo)

రజినీకాంత్ ‘అన్నాత్తే’ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ (Twitter/Photo)

Rajinikanth - Annaatthe :  తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రస్తుతం ‘అన్నాత్తే’ సినిమా కోసం తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

    Rajinikanth - Annaatthe :  తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రస్తుతం ‘అన్నాత్తే’ సినిమా కోసం తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ కూడా రెడీ అయింది. త్వరలో సెన్సార్‌కు వెళ్లనుంది. అంతేకాదు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ డబ్బింగ్ వెర్షన్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఈ  సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకు మంచి రేటే దక్కించుకున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన మీనా, కుష్బూ కథానాయికలుగా నటించారు. రజినీకాంత్ ‘అన్నాత్తే’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో పిక్చరైజ్ చేశారు. దాంతో  పాటు కలకత్తాలో కూడా కొన్ని సన్నివేశాలను పిక్చరైజ్ చేసారు.

    కీర్తి సురేష్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. జగపతిబాబు, ప్రకాష్ రాజు, సత్యదేవ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఈ నెల 14న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు.


    ఇక అన్నాత్తే కంటే ముందు రజనీ దర్భార్ అంటూ వచ్చారు. మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మధ్య సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న రజనీకాంత్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు ఆయన అభిమానులు. ఇక ఈ సినిమా దర్శకడు శివ విషయానికి వస్తే.. డైరెక్టర్ శివ ఇటు మాస్, అటు క్లాస్ రెండు వర్గాలను ఆకట్టుకోగలరు. అందులో భాగంగా వారిచేత విజిల్ వేయించగలరు.

    NBK - Chiranjeevi - Nagarjuna - Jr NTR: చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..


    దర్శకుడు శివ గతంలో అజిత్ కుమార్‌తో ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు తీసి.. తమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. తెలుగులో ‘అన్నాత్తే’ మూవీకి ‘అన్నయ్య’ లేదా ‘పెద్దన్నయ్య’ అనే పేర్లు పరిశీలిస్తున్నారు.  సినిమాలో రజనీకాంత్‌ ఊరి పెద్దగా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ సినిమాను స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ పై కళానిరిధి మారన్  నిర్మిస్తున్నారు. ఇక ‘అన్నాత్తే’ సినిమాను  నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Annaatthe Movie, Keerthy Suresh, Kollywood, Rajinikanth, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు