Home /News /movies /

SUPER STAR RAJINIKANTH AGAIN TEAM UP WITH DIRECTOR SIVA TA

Rajinikanth : రజినీకాంత్ మరో సంచలన నిర్ణయం.. ఆ దర్శకుడికి మరో ఛాన్స్ ఇస్తోన్న తలైవా..

సూపర్ స్టార్ రజినీకాంత్ (File/Photo)

సూపర్ స్టార్ రజినీకాంత్ (File/Photo)

Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ మరో సంచలన నిర్ణయం.. ఆ దర్శకుడికి మరో ఛాన్స్ ఇస్తోన్నట్టు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. 

    Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ మరో సంచలన నిర్ణయం.. ఆ దర్శకుడికి మరో ఛాన్స్ ఇస్తోన్నట్టు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..  ‘దర్బార్’ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘అన్నాత్తే’ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న థియేటర్స్‌లో విడుదలైంది. తెలుగులో ఈ సినిమా ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. తమిళనాడులో రజినీకాంత్‌ క్రేజ్‌తో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. అంతేకాదు అక్కడ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమాకు అనుకున్నంత ఫలితం రాలేదు. ‘లింగ’ తర్వాత రజినీకాంత్ సినిమాలేవి తెలుగులో సత్తా చూపెట్టలేకపోయాయి. ఇక తెలుగులో ‘కబాలి’ ఫస్ట్ డే రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత రాను రాను తెలుగులో రజినీకాంత్ సినిమాలకు తెలుగులో క్రేజ్ తగ్గతూ వచ్చింది. ఆ ఎఫెక్ట్ ‘పెద్దన్న’పై పడింది. ఈ సినిమాకు ఫస్ట్ డే తెలుగులో సరైన ఓపెనింగ్స్ దక్కించుకోలేక చతికిలపడిపోయింది.

    తెలుగులో ఈ సినిమాను రూ. 12 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. కానీ ఫైనల్‌గా రూ. 4.54 కోట్లతో సరిపెట్టుకుని డబుల్ డిజాస్టర్‌గా నిలిచింది. మొత్తంగా తెలుగులో రజినీకాంత్ కెరీర్‌లో ఇంత కంటే ఘోరమైన సినిమా నిలిచిపోయింది. ఈ సినిమాను దర్శకుడు శివ తన పాత సినిమాలైన ‘వేదాలం’, ‘విశ్వాసం’ సినిమాలతో పాటు గతంలో బి.గోపాల్, కోదండరామిరెడ్డి తెరకెక్కించిన పాత సినిమాలనే కాస్తా మార్చి తెరకెక్కిస్తాడనే పేరు ఉంది.

    NBK - Akhanda : బెజవాడ కనకదుర్గమ్మ మరియు పానకాల నరసింహా స్వామిని దర్శించుకున్న ‘అఖండ’ టీమ్..

    పైగా తెలుగులో  ఈ సినిమాకు చివరి వరకు సరైన టైటిల్ ప్రకటించలేదు. అనారోగ్యం కారణంగా రజినీకాంత్ తెలుగులో అనుకున్నంత రేంజ్‌లో ప్రమోషన్ చేయలేకపోయారు. ఇవన్నీ తెలుగులో ‘పెద్దన్న’ డిజాస్టర్ జాబితాలో చేర్చిందనే చెప్పాలి.ఇపుడు రజినీకాంత్‌తో సినిమా అనగానే సేఫ్ గేమ్ ఆడాడు. తమిళంలో హిట్ అనిపించుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది.

    RRR : ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ఆర్ఆర్ఆర్ మరో రికార్డు.. 100 మిలియన్స్ వ్యూస్ దాటిన ట్రైలర్..

    తనకు తెలుగులో డబుల్ డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు శివకు సూపర్ స్టార్ మరోసారి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం. మరి తెలుగులో అంతగా మెప్పించని ఈ కాంబినేషన్.. తమిళ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇక రజినీకాంత్‌తో శివ చేయబోయే రెండో చిత్రం ‘పెద్దన్న’కు సీక్వెలా లేకుండా ఏదైనా కొత్త కథతో తెరకెక్కిస్తాడా అనేది చూడాలి.

    Akhanda - NBK : బాలకృష్ణ ‘అఖండ’ డిజిటల్ స్ట్రీమింగ్.. శాటిలైట్ ప్రసారానికి ముహూర్తం ఖరారు.. ?

    ఐతే.. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ  చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.  ఇక థియేటర్స్‌లో ఈ సినిమాను చూడని ప్రేక్షకులు .. రజినీకాంత్ అభిమానులు ఎంచక్కా నెట్‌ప్లిక్స్ ఓటీటీలో ఈ సినిమాను చూడొచ్చు. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 50 కోట్లకు అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్టు సమాచారం.

    Celebrities Marriages 2021 : విక్కీ కౌశల్, కత్రినా సహా ఈ యేడాది పెళ్లి పీఠలు ఎక్కిన సినీ ప్రముఖులు..

    ఇక రజినీకాంత్ ‘పెద్దన్న’  సినిమా రిలీజ్ హడావుడిలో ఉండగానే.. రజనీకాంత్ ..కేంద్ర ప్రభుత్వం నుంచి సినీ రాంగంలోని ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఇక ఢిల్లీ నుంచి చెన్నై వచ్చిన తర్వాత అస్వస్థతకు గురై చెన్నైలోని కావేరి హాస్పిటల్‌‌లో జాయిన్ అయ్యారు. చికిత్స తర్వాత ఈయన హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ కావడంతో రజినీకాంత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Director Siva, Kollywood, Rajinikanth, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు