Pawan Kalyan - PSPK27: పవన్, క్రిష్ కాంబినేషన్ చిత్రానికి మహేష్ ‘ఒక్కడు’ టచ్

Super star Mahesh Okkadu touch for Pawan Kalyan and Krish combination movie

Pawan Kalyan - PSPK27: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, డైరెక్టర్‌ క్రిష్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కోసం భారీ సెట్‌ వేశారు. ఈ సెట్‌ గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది.

  • Share this:
    పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ 'వకీల్‌సాబ్‌' చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాత రెండు సినిమాలను ఒకేసారి ట్రాక్‌ ఎక్కించాడు. అందులో ఒకటి సాగర్‌ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం(మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్‌ కోశియమ్'కు రీమేక్‌).. మరో చిత్రం క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ మూవీ. రెండు సినిమాల షెడ్యూల్స్‌ కంటిన్యూగా ప్లాన్ చేసుకుని నెమ్మదిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న పవన్‌కల్యాణ్‌.. కొత్త షెడ్యూల్‌ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ఆసక్తికరమైన విషయమేమంటే, క్రిష్‌ సినిమా కోసం ఓ భారీ సెట్‌ను ఓ ప్రైవేట్‌ ల్యాండ్‌లో వేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఇంతకీ పవన్‌కల్యాణ్‌ 27వ సినిమా కోసం వేస్తున్న సెట్‌ ఏంటో తెలుసా..ఛార్మినార్‌. ఈ నెల 19 నుంచి ఈ సినిమా షెడ్యూల్‌ ప్రారంభం అవుతుందట. ఈ షెడ్యూల్లో పవన్‌కల్యాణ్‌తో పాటు బాలీవుడ్‌ స్టార్‌ అర్జున్‌ రాంపాల్‌ కూడా పాల్గొనబోతున్నాడు.

    17వ శతాబ్దానికి చెందిన కథాంశంతో క్రిష్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో పవన్‌కల్యాణ్‌ రాబిన్‌ హుడ్ స్టైల్‌లో బందిపోటు పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో మొఘల్‌ చివరి చక్రవర్తి అయిన జౌరంగజేబు పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ అర్జున్‌ రాంపాల్‌ కనిపిస్తారు. ఈ చిత్రానికి 'హరి హర వీరమల్లు' అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఫస్ట్‌ లుక్‌ను మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేస్తారని టాక్‌. ఖుషి తర్వాత.. పవన్‌కల్యాణ్‌తో ఎ.ఎం.రత్నం నిర్మిస్తోన్న చిత్రమిది.

    power star pawan kalyan, pspk26, pspk 27, vakeel saab, hari hara veera mallu, pawan kalyan movie updates, pawankalyan news, director krish movie look, vakkel saab second single, maha sivaratri, valentines day, పవన్‌కల్యాణ్, వకీల్‌సాబ్, హరి హర వీరమల్లు, pspk 27 tiltle, pspk 27 second schedule, charminar set for pspk27
    Super star Mahesh Okkadu touch for Pawan Kalyan and Krish combination movie


    మరో వైపు పవన్‌కల్యాణ్‌ టైటిల్‌ పాత్రలో నటించిన 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న విడుదలవుతుంది. ఈ సినిమా నుంచి రెండో సాంగ్‌ను వేలంటెన్స్‌ డే సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్‌ చేశారు. అంతా ప్లానింగ్‌ ప్రకారం జరిగితే వకీల్‌ సాబ్‌తో పాటు క్రిష్‌ సినిమా కూడా ఇదే ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
    Published by:Anil
    First published: