• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SUPER STAR MAHESH FOLLWS POWER STAR PAWAN KALYAN HARIHARA VEERAMALLU MOVIE MHN

Pawan Kalyan - Harihara Veeramallu: పవన్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ స్టైల్‌ను ఫాలో అవుతున్న మహేశ్!

Pawan Kalyan -  Harihara Veeramallu: పవన్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ స్టైల్‌ను ఫాలో అవుతున్న మహేశ్!

Super Star Mahesh follws Power star Pawan Kalyan Harihara Veeramallu movie

Pawan Kalyan - Harihara Veeramallu: పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లుని సూపర్ స్టార్ మహేశ్ ఫాలో అవుతున్నాడంటూ ఓ క్రేజీ వార్తొకటి నెట్టింట చక్కర్లుకొడుతుంది. ఇంతకీ అదేంటో తెలుసా?

  • Share this:
    టైటిల్ చూడగానే ఇదేంటి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా స్టైల్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫాలో అవుతున్నారా..? అని కాస్త ఆలోచిస్తున్నారు కదూ..? అవును తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అలానే నడుస్తోంది. ఏది కూడా చివరి దాకా చెప్పకుండా సడన్‌గా అభిమానులకు, సినీ ప్రియులకు సర్‌ప్రైజ్ ఇవ్వడం ఓ ట్రెండ్ అయిపోయింది. అందుకే ఈ విషయంలో మహేశ్.. పవర్ స్టార్‌ను ఫాలో అవుతున్నారట. ఇంతకీ ఆ ఫాలో అయ్యే విషయమేంటో తెలుసుకోవాలని ఉందా..? ఇంకెందుకు ఆలస్యం ఈ ఆర్టికల్ చదివేసి అసలు సంగేతంటో తెలుసుకోండి మరి.

    పవన్‌ హీరోగా స్టార్ డైరెక్టర్లలో ఒక్కరైన క్రిష్‌ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. శివరాత్రి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. 10, 20 కాదు ఏకంగా రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను మెగా సూర్యా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇదొక లెజండరీ బందిపోటు వీరోచిత గాథ కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. వాస్తవానికి ఈ సినిమా ఒక్క తెలుగులో తప్ప వేరే భాషల్లో రిలీజ్ చేయరేమో అని అందరూ అనుకున్నారు. అయితే సడన్‌గా ఇది పాన్ ఇండియా మూవీ అని.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో అభిమానులు, సినీప్రియుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ట్రెండ్ నడుస్తుండగా.. పైగా పవన్ స్టార్ హీరో కావడంతో ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చేమో.

    power star, pawan kalyan, harihara veeramallu, pawankalyan latest movie news. pspk 27 update, harihara veeramallu release date, director krish, super star mahesh, sarkaru vaari paata, mahesh 27, tollywood updates, telugu cinema news, పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు, క్రిష్, సూపర్ స్టార్ మహేష్, సర్కారువారిపాట, టాలీవుడ్ అప్‌డేట్స్, తెలుగు సినిమా న్యూస్
    Super Star Mahesh follws Power star Pawan Kalyan Harihara Veeramallu movie


    అయితే.. ఇప్పుడు అదే స్టైల్‌ను మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ తెరకెక్కిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్ర యూనిట్‌ కూడా ఫాలో అవుతోందట. ముందుగా ఈ సినిమాను తెలుగు వరకే అనుకున్నప్పటికీ మహేశ్‌ కూడా స్టార్ హీరో పైగా ప్రపంచ వ్యాప్తంగా ఈయన వీరాభిమానులు ఉండటంతో దీన్ని కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అంతేకాదు.. పవన్ ‘హరిహర వీరమల్లు’ విషయంలో ఆ సినిమా యూనిట్ ఎంతో గోప్యంగా ఉంచి టీజర్ రిలీజ్ చేసినప్పుడు అసలు విషయం బయటపెట్టింది. అదే స్టైయిల్‌ను ఫాలో అవుదామని దర్శక నిర్మాతలతో మహేశ్‌ అన్నారట. దీనికి ఓకే చెప్పిన చిత్రబృందం త్వరలోనే ‌‘సర్కారు వారి పాట’ కు సంబంధించి కీలక ప్రకటన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

    సో.. దీన్ని బట్టి చూస్తే డైలాగ్‌లోనే కాదు ఇలా సినిమా విషయంలో పవన్ ట్రెండ్‌ను ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే అన్నట్లుగా జనసేనాని అభిమానులు చెప్పుకుంటున్నారట. వాస్తవానికి మహేశ్ ఫ్యాన్స్‌కు.. పవన్ ఫ్యాన్స్‌కు అస్సలు పడదు. ఈ ‘ఫాలో’ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటంతో.. అబ్బే మా హీరో (మహేశ్) కు అంత అవసరం లేదని.. ఆయనే ఒక ట్రెండ్ సెట్టరన్న విషయం ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడని.. అలాంటప్పుడు మీ హీరో (పవన్‌) ను సూపర్‌స్టార్ ఎందుకు ఫాలో అవుతారు..? అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ విషయంపై దర్శకుడు లేదా నిర్మాత గానీ క్లారిటీ ఇస్తే తప్ప ఇందులో నిజానిజాలెంతో తెలియదు మరి!.
    Published by:Anil
    First published: