హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh - Sitara: వెబ్ సిరీస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సితార

Mahesh - Sitara: వెబ్ సిరీస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సితార

మహేష్ బాబు సితార (Mahesh babu Sitara)

మహేష్ బాబు సితార (Mahesh babu Sitara)

Mahesh - Sitara: సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ కుమార్తె సితార త్రీడీ యానిమేష‌న్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారారు

  సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ సినిమాల‌కే ప‌రిమితం కాకుండా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గానూ దూసుకెళుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇదే ఫ్యామిలీ తండ్రిని ఫాలో అవుతుంది చిచ్చ‌ర పిడుగు సితార‌. మ‌హేశ్‌, న‌మ‌త్ర శిరోద్క‌ర్‌ల ముద్దుల త‌న‌య సితార యానిమేష‌న్ త్రీడీ వెబ్ సిరీస్ ఫంటాస్టిక్ తార‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారారు. ఈ వెబ్ సిరీస్‌లో మొద‌టి సీజ‌న్‌ను ఏప్రిల్ నుండి ప్ర‌సారం కానుంది. చిన్న‌ప్ప‌ట్నుంచి సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సితార.. ఆక‌ట్టుకునే ఫొటోలు, వీడియాలతో ఆక‌ట్టుకుంటోంది. తండ్రితో, సోద‌రుడు గౌత‌మ్‌, త‌ల్లి న‌మ్ర‌త‌తో సోష‌ల్ మీడియాలోనే కాకుండా వంశీ పైడిప‌ల్లి కుమార్తె ఆద్య‌తో క‌లిసి ఏ అండ్ ఎస్ అనే యూ ట్యూబ్ ఛానెల్ కూడా ఏర్పాటు చేసింది సితార‌. అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ చాలా యాక్టివ్‌గా ఉండే సితార ఇప్పుడు ఏకంగా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారడం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

  ఫంటాస్టిక్ తార కార్య‌క్ర‌మాన్ని హైద‌రాబాద్‌లో ఘ‌నంగా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి సితారతో పాటు న‌మ్ర‌తా శిరోద్క‌ర్ కూడా పాల్గొంది. అలాగే బాలీవుడ్ న‌టి నేహా ధూపియా, తెలంగాణ ఐటీ శాఖా ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సిరీస్‌కు సితార బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డంపై నిర్మాత‌లు న‌య‌న్‌, మ‌నీష్‌, డైరెక్ట‌ర్ రాజేంద్ర త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. వెబ్ సిరీస్ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు.

  కేవ‌లం చ‌దువు, ఆట‌పాట‌ల‌కే సితార ప‌రిమితం కావ‌డం లేదు. కొన్ని సంద‌ర్భాల్లో ప‌లు హిట్ సాంగ్స్‌కు డాన్సులు కూడా చేసి ఆ వీడియోల‌ను రూపొందించి వాటిని నెట్టింట పోస్ట్ చేస్తుంటుంది సితార‌. ఇప్పుడు సితార బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మార‌డంపై ఆమె ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అంద‌రికీ అర్థ‌మ‌వుతూనే ఉంది.

  Published by:Anil
  First published:

  Tags: Mahesh Babu Daughter Sitara, Namrata, SITARA

  ఉత్తమ కథలు