హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu Mother Passes Away : సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూత..

Mahesh Babu Mother Passes Away : సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూత..

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూత (Twitter/Photo)

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూత (Twitter/Photo)

Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ యేడాది జనవరిలో పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్నుమూసిన ఘటన మరవక ముందే తాజాగా కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్నమూయడం విషాదకరం. ఈమె మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ యేడాది జనవరిలో పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్నుమూసిన ఘటన మరవక ముందే తాజాగా కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్నమూయడం విషాదకరం.  ఆమె వయసు 70 యేళ్లు. కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు మహేష్ బాబు, రమేష్ సహా ఐదుగురు సంతానం. వీళ్లు కాకుండా మరో ముగ్గురు ఆడపిల్లలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు తెలుగులో హీరోగా నటిస్తున్నారు. గత కొంత కాలంగా ఇందిరా దేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరోవైపు పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతితో ఆమె కృంగి పోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆమె ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. అంతేకాదు అప్పట్లో కృష్ణ, విజయ నిర్మల పెళ్లికి ఈమె సహకరించారు.ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు అభిమానులు సందర్శన కోసం ఆమె పార్ధివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచి అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నట్టు మీడియాకు తెలిపారు. 

మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ.. మూడేళ్ల క్రితం రెండేళ్ల క్రితం విజయ నిర్మల కన్నుమూయం ఒక దెబ్బ అయితే.. ఈ యేడాది జనవరిలో పెద్ద కుమారుడు రమేష్ బాబు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం.. తాజాగా మొదటి భార్య.. ఇందిరా దేవి తుది శ్వాస విడవడం బాధాకరం. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ.. ఐదేళ్ల క్రితం విడుదలైన ‘శ్రీశ్రీ ’ మూవీ తర్వాత మరే సినిమాలో నటించలేదు. ఇంటి పట్టునే ఉంటున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టేనర్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తోంది.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయ్యింది. అక్కడే ఓ మూడు రోజులు షూట్ చేశారు. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో కొన్ని హై ఆక్టేన్ ఎపిక్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారట. ఇక రెండో షెడ్యూల్ దసరా తర్వాత మొదలుకానుందని తెలిపారు చిత్ర నిర్మాత నాగవంశీ.. ఈ రెండో షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ ప్రత్యేక సెట్‌లో షూట్ రెస్యూమ్ కానుందట.

Ponniyin Selvan: బాహుబలి లెవల్లో మణిరత్నం ’పొన్నియన్ సెల్వన్’.. అభిమానులను ఆకట్టుకునే పాత్రలు ఇవే..

ఇక దాదాపుగా ఓ 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబుతో చేస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ అందరి అంచనాలు అందుకునేలా తెరకెక్కిస్తున్నారట. యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఊహించుకుంటున్నారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు మొన్నటి వరకు పార్థు అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్ రాగా.. ఇప్పుడు తాజాగా మరో టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ అ సెంటిమెంట్ కూడా కలిసి రావడంతో.. ఈ టైటిల్‌ను ఖరారు చేశారట. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానుంది

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Mahesh Babu, Super Star Krishna, Tollywood

ఉత్తమ కథలు