Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: November 30, 2020, 10:26 PM IST
మహేష్ బాబు (mahesh babu)
డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి.. కానీ సాయం చేసే గుణం మాత్రం చాలా తక్కువ మంది దగ్గరే ఉంటుంది. అలాంటి వాళ్లలో మహేష్ బాబు కూడా ఉంటాడు. పిల్లల పట్ల సాయం చేయడంలో మహేష్ బాబు ఎప్పుడూ ముందే ఉంటాడు. చేసే సాయం అందరికి తెలియకుండా చూసుకుంటున్నాడు సూపర్ స్టార్. అలా రియల్ హీరో అనిపించుకుంటున్నాడు మహేష్ బాబు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈయన. తాజాగా మరో చిన్నారికి కూడా ప్రాణదానం చేసాడు మహేష్. సేవాగుణంలో నిజమైన హీరో అనిపించుకున్నాడు ఈయన. తాజాగా డింపుల్ అనే చిన్నారి వైద్య ఖర్చులన్నీ మహేష్ బాబు భరించాడు. అరుదైన కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్ అనే వ్యాధితో బాధ పడుతున్న ఆ చిన్నారికి అండగా నిలిచాడు సూపర్ స్టార్. ఇప్పటికే ట్రీట్మెంట్ ప్రారంభమైంది.. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుందని.. ఆ చిన్నారికి, తన కుటుంబానికి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్రత ఈ సందర్భంగా ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే ఒక్కరు ఇద్దరు కాదు.. 1010 మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న చిన్నారులకు అవసరమైన సర్జరీలు చేయించాడు మహేష్ బాబు.
పేద కుటుంబాల్లో వెలుగులు నింపడానికి.. అనారోగ్యంతో బాధ పడుతున్న చిన్నారులను బ్రతికించడానికి ముందుకొస్తున్నాడు సూపర్ స్టార్. ఈ సాయంలో కొన్ని హాస్పిటల్స్‌తో కూడా టై అప్ అయ్యాడు మహేష్ బాబు. వాళ్ల సహకారంతోనే ఇదంతా చేస్తున్నాడు. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో హెల్త్ చెకప్‌లు నిర్వహించడమే కాకుండా ఇప్పటి వరకు 1010 చిన్నారులకు ఎంతో క్లిష్టమైన గుండె సంబంధిత సర్జరీలను చేయించాడు మహేష్ బాబు. ఆ చిన్నారుల మొహాల్లో చిరునవ్వులు నింపడానికి తన వంతు కృషి చేస్తున్నాడు సూపర్ స్టార్.

మహేష్ బాబు Photo : Twitter
తాజాగా డింపుల్ మాత్రమే కాదు ఈ మధ్యే భవ్యశ్రీ అనే చిన్నారికి వెంటనే హార్ట్ ఆపరేషన్ చేయాలని.. లేకపోతే పాప ప్రాణాలు కాపాడలేమంటూ మహేష్ బాబుకు నెటిజన్ రిక్వెస్ట్ పెట్టాడు. ఆ చిన్నారిని ఎలాగైనా కాపాడమని సోషల్ మీడియాలో మహేష్ బాబు సాయం కోరాడు. ఈ విషయాన్ని తన టీమ్ ద్వారా తెలుసుకున్న మహేష్ వెంటనే స్పందించి ఆ చిన్నారికి జూలై 17న విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్‌లో హార్ట్ సర్జరీ చేయించాడు. తద్వారా ప్రాణం కాపాడాడు.. ఇప్పటి వరకు 1015 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె సంబంధిత రోగాలు నయం చేయించాడు మహేష్ బాబు. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్.
Published by:
Praveen Kumar Vadla
First published:
November 30, 2020, 10:26 PM IST