Mahesh Babu: సినీ కెరీర్లో మొదటిసారి మహేష్ బాబు ఆ ప్రయోగానికి రెడీ అవుతున్నాడా.. అంటే ఔననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. వివరాల్లోకి వెళితే.. మహేష్ బాబు.. కృష్ణ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు. ఇక కెరీర్ తొలినాళ్లలో మహేష్ బాబు కెరీర్లో ‘ఒక్కడు’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో మహేష్ బాబు సీని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్టు ఆ సినిమాను నిర్మించిన నిర్మాత యం.యస్.రాజు రీసెంట్గా సోషల్ మీడియాలో ప్రచారంలో భాగంగా వెల్లడించారు. ఈయన తన లేటెస్ట్ మూవీ ‘డర్టీ హ్యారీ’ ప్రమోషన్లో భాగంగా ఈ విషయాన్ని చెప్పారు. ఇప్పటికే ఈయన మహేష్ బాబు ఇమేజ్ తగ్గ ఓ కథను రెడీ చేయిస్తున్నట్టు వెల్లడించాడు. దాంతో ఓ నెటిజన్..ఆ సినిమా ఒక్కడు మూవీకి సీక్వెల్ ఒక్కడు 2 అంటా ప్రశ్నించాడు. దానికి యం.యస్.రాజు.. అవునన్నట్టు చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
ఒక్కడు సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాను సుమంత ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో యం.యస్.రాజు నిర్మించారు. గుణశేఖర్ డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన భూమిక హీరోయిన్గా నటించింది. విలన్‌గా ప్రకాష్ రాజ్ నటించారు.
ఒక్కడు మూవీలో మహేష్ బాబు, భూమిక (File/Photo)
2003లో విడుదలైన ఈ సినిమా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ కథను యం.యస్.రాజు రెడీ చేసినా.. మహేష్ బాబు ఈ స్టోరీ విని ఓకే చెబుతాడా ? లేదా అనేది చూడాలి. టాలీవుడ్లో సీక్వెల్స్ నడిచిన దాఖలాలు లేవు. మరి సెంటిమెంట్స్‌ను ఎక్కువగా నమ్మె మహేష్ బాబు.. ఒకపుడు తనను స్టార్ హీరోను చేసిన ఈ సూపర్ హిట్ సినిమా సీక్వెల్‌కు ఓకే చెబుతాడా లేదా అనేది చూడాలి.