news18-telugu
Updated: April 15, 2019, 7:33 PM IST
నమ్రత పాత ఫోటో
సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అంతేకాదు తనకు సంబంధించిన సినిమా విశేషాలతో పాటు కుటుంబ విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమాలనుతో పంచుకుంటున్నాడు. మరోవైపు మహేష్ బాబు భార్య..నమ్రత కూడా సామాజిక మాధ్యమాల్లో మహేష్ బాబుకు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. ఎవరైన తమకు సంబంధించిన స్పెషల్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. దానికి త్రోబ్యాక్ పిక్ అనే క్యాప్షన్ ఇవ్వాలి. అంతేకాదు పోస్ట్ చేసే ఫోటోలో ఏదైనా స్పెషాలిటీ ఉండాలి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత..90లో తన ఫ్రెండ్ స్వెట్లానా క్యాప్పర్తో దిగిన పాత ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మహేష్ బాబుతో ‘వంశీ’ సినిమా తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే కదా.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
April 15, 2019, 7:33 PM IST