సంచలన దర్శకుడితో మహేష్ బాబు మూవీ.. కాంబినేషన్ సెట్ చేసిన నమ్రత..

Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు సంచలన దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: March 24, 2020, 7:03 PM IST
సంచలన దర్శకుడితో మహేష్ బాబు మూవీ.. కాంబినేషన్ సెట్ చేసిన నమ్రత..
మహేష్ బాబు నమ్రత (mahesh babu namrata)
  • Share this:
సూపర్ స్టార్ మహేష్ బాబు సంచలన దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..  ఈ యేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.ఈ సినిమా తర్వాత మహేష్ బాబు.. వంశీ పైడిపల్లితో నెక్ట్స్ మూవీ చేయబోతున్నట్టు ప్రకటించాడు. కానీ ఫైనల్‌‌గా స్క్రిప్ట్ విషయంలో కాస్తా కన్ఫ్యూజన్ ఏర్పడడంతో మహేష్ బాబు.. తన ప్రాజెక్ట్‌ను గీతా గోవిందం డైరెక్టర్ పరుశురామ్‌తో చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే అయిన మే 31న పూజా కార్యక్రమాలో ప్రారంభించి నెక్ట్స్ సమ్మర్‌లో ఈ సినిమా విడుదల చేయాలనే ప్లాన్‌ ఉన్నాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీ చేయడానికి రెడీ అవుతన్నట్టు సమాచారం. మరోవైపు కొరటాల శివ, చిరంజీవి సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టు వినిపించినా.. పారితోషకం విషయంలో తేడాలు రావడంతో మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. తాజాగా మహేష్ బాబుకు తనకు స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమాల్లో ‘పోకిరి’ ఒకటి.  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో మహేష్ బాబు..సూపర్ స్టార్ అయ్యాడు. ఈ సినిమాలో పూరీ జగన్నాథ్ అప్పటి వరకు మహేష్‌ను ఎవరు చూపించని కొత్త కోణంలో చూపించి మంచి సక్సెస్ అందించాడు.

star heroes still cant believe ismart director puri jagannadh even after blockbuster pk ఇన్ని రోజులంటే పూరీ జ‌గ‌న్నాథ్‌కు హిట్ లేదు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు వేరు. ఈయ‌న కూడా ఇప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. తాజాగా ఈ ద‌ర్శ‌కుడి నుంచి వ‌చ్చిన‌ ఇస్మార్ట్‌ శంకర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. puri jagannadh,puri jagannadh twitter,puri jagannadh facebook,mahesh babu,puri jagannadh star heroes,mahesh babu movies,puri jagannadh about mahesh babu,puri jagannadh interview,puri jagannadh movies,puri jagannadh interview mahesh babu,puri jaganndh about mahesh babu,puri jagannadh comments on mahesh babu,why puri jagannadh insults mahesh babu,director puri jagannadh comments on mahesh babu,director puri jagannadh,puri jagannadh vijay devarakonda,telugu cinema,పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాథ్ స్టార్ హీరోలు,తెలుగు సినిమా
మహేష్ బాబు పూరీ జగన్నాథ్


ఆ తర్వాత వీరిద్దిరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బిజినెస్ మ్యాన్’ కూడ మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో సూర్య భాయిగా మహేష్‌లోని విలన్ షేడ్స్ బయటపెట్టాడు పూరీ జగన్నాథ్. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో సినిమాగా ‘జనగణమన’ అనే  సినిమాను అనౌన్స్ చేశారు. ఐతే ఈ సినిమా చేసే సమయానికి పూరీ జగన్నాథ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. మరోవైపు ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పూరీజగన్నాథ్ మహేష్‌ను ఒప్పించడంలో విఫలమయ్యాడు. దీంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది.తాజాగా వీళ్లిద్దరి కలయికలో మరో సినిమాకు రంగం సిద్ధం అయినట్టు సమాచారం. గతంలో ఆగిపోయిన జనగణమన సినిమానే కొంచెం మార్పులు చేర్పులు చేసి మహేష్ బాబును ఒప్పించాడట.

super star mahesh babu wife namarata set to puri jagannadh combination,super star mahesh babu,mahesh babu namrata,mahesh babu puri jagannadh,mahesh babu,mahesh babu puri jagannadh combination set,mahesh babu sukumar cinema cancelled,mahesh babu sukumar movie cancelled, mahesh babu puri jagannadh janaganamana movie cancelled, mahesh babu sukumar puri jagannadh, mahesh babu cancelled puri jagannadh sukumar sandeep reddy vanga, tollywood news, telugu cinema, mahesh babu cancelled movie, మహేష్ బాబు, మహేష్ బాబు సుకుమార్, ఆగిపోయిన మహేష్ సుకుమార్ సినిమా, పట్టాలెక్కని మహేష్ బాబు సుకుమార్ సినిమా, పూరీ జగన్నాథ్‌ తో క్యాన్సిల్ అయిన మహేష్ బాబు జనగణమన మూవీ, మహేష్ బాబు పూరీ జగన్నాథ్ సుకుమార్ సందీప్ రెడ్డి వంగా, టాలీవుడ్ న్యూస్, తెలుగు సినిమా,మహేష్ బాబు పూరీ జగన్నాథ్
అప్పట్లో ఆగిపోయిన పూరీ,మహేష్ జనగణమణ సినిమా (Twitter/Photo)


సినీ ఇండస్ట్రీలో, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న దాన్ని నిజం చేస్తూ. ఇపుడు వీళ్ల కాంబినేషన్‌కు రంగం సిద్ధం అయింది. ఐతే.. రీసెంట్‌గా ఛార్మి నమ్రతను కలిసి జనగణమన సినిమా ఫైనల్‌ స్టోరీని నమ్రతకు వినిపించి.. ఆమెతో మహేష్ బాబుకు రాయబారం పంపిందట. మహేష్ బాబు కూడా వరుస సినిమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలోనే పూరీ సినిమా స్టోరీ నచ్చి ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 24, 2020, 7:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading